గర్బిణుల కోసం రైల్వేశాఖ అనే ప్రత్యేక సౌకర్యాలు కల్పి్స్తోంది. రైళ్లల్లో వాళ్లు సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భధారణ సమయంలో రైలు ప్రయాణం చేయడం చాలా కష్టం. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టతరమైన పని. గర్భిణులకు ప్రయాణాలు చేయవద్దని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కానీ అత్యవసరమై ప్రయాణం చేసేవారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
గర్బిణి మహిళలు రైళ్లల్లో లోయల్ బెర్త్ పొందే అవకాశముంది. ఐఆర్సీటీసీ యాప్ లేదా పోర్టల్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు గర్బిణులకు లోయల్ బెర్త్ కేటాయించేందుకు ప్రాధాన్యత కల్పిస్తారు. అయితే కొన్నిసార్లు సీట్లు ఖాళీగా లేకపోతే లోయల్ బెర్త్ దక్కకపోవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలనేది చూద్దాం.
ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసినప్పుడు గర్భిణీ మహిళలకు టికెట్ దక్కకపోతే ఆఫ్‌లైన్‌లో అభ్యర్ధించవచ్చు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను సంప్రదించి వైద్య ధృవీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు పరిశీలించి లోయర్ బెర్త్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో పొందలేనివారు ఈ విధానం పాటించాలి.
రైల్వే రిజర్వేషన్లలో సీనియర్ సిటిజన్లు, గర్బిణీ మహిళలు, 45 ఏళ్లు నిండిన మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. వేర్వేరు తరగతుల్లో వీరికి లోయర్ బెర్త్‌లు కేటాయిస్తున్నారు. స్లీపర్ క్లాస్‌లో వీరి కోసం ఆరు నుంచి ఏడు లోయర్ బోర్త్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ధర్డ్ ఏసీలో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు ఉంటాయి.
ఇక సెకండ్ ఏసీ కోచుల్లో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. లోయర్ బెర్త్‌లోని ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకున్నప్పుడు టీటీఈని సంప్రదించి గర్బిణీ మహిళలు లోయర్ బెర్త్ పొందవచ్చు. ఆన్లైన్లో బుక్ కాకపోయినా ట్రైన్ ఎక్కాక టీటీఈని సంప్రదించి అభ్యర్ధించవచ్చు.




