Headlines

The Paradise: యాక్టింగ్ కాకుండా నాకు తెలిసిన స్కిల్ అదొక్కటే.. హీరో కాకపోయి ఉంటే ఆ పని చేసే వాడిని: నాని


నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి రూ. 114 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమాలో ముఖ్యంగా నాని, మోహన్ బాబుల యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. వారిని చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం శనివారం (సెప్టెంబర్ 26) హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. నాని, మోహన్ బాబుతో సహా చిత్ర బృందమంతా ఈ కార్యక్రమానికి చేరుకుంది. దీంతో పాటు జనాల్లోకి తన సినిమాను మరింతగా తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా నిర్వహించిన ‘నాని రాపిడో ఫ్యాన్స్ మీట్’లో ఆయన పాల్గొని రైడర్లతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడిన నాని .. ‘ నాకు టూవీలర్ డ్రైవింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. కొత్త వ్యక్తులను కలవడం, వారితో ప్రయాణిస్తూ వారి జీవిత కథలను వినడం చాలా సరదాగా ఉంటుంది. ఒకవేళ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో కాకపోయి ఉంటే.. ఖచ్చితంగా మీలాగే ఒక రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్‌గా స్థిరపడేవాడిని. ఎందుకంటే నాకు బైక్ డ్రైవింగ్ తప్ప పెద్దగా వేరే స్కిల్స్ ఏమీ రావు. నేనూ మీలాగే బైక్ నడుపుకుంటూ, ఈరోజు ఎవరిదో ఒక హీరో ఈవెంట్‌కు ప్రేక్షుకుడిగా వచ్చేవాడినేమో’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా వాస్తవానికి నాని మొదట్లో హీరో అవ్వాలనుకోలేదు. దర్శకుడు అవుదామని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం మొదలెట్టిన ఆయన ఆ తర్వాత అనుకోకుండా ‘అష్టా చమ్మా’తో హీరోగా మారాడు. ఇక ఆ తర్వాత నాని ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఇక ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. మలయాళం బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటించింది. అలాగే మోహన్ బాబు విలన్ గా అదరగొట్టారు. అలాగే రాఘవ్ జుయెల్, సంపూర్ణేష్ బాబు, సోనాల్ కులకర్ణి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి



ర్యాపిడో బైక్ డ్రైవర్లతో హీరో నాని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *