Headlines

Dharmana Prasad: వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే.. Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు!


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్లకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. ఇప్పుడు తమ కేడర్ పూర్తి ఉత్సాహంతో పనిచేస్తుందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నామని.. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ఆయన తెలిపారు.

2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, 2022లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు లీడర్‌షిప్ మాకు లేదు అంటున్నారు. ఎన్నికలు జరిగితే తాడోపేడో తేల్చేస్తాం. రుజువు చేసి చూపిస్తాం. ఉత్సాహం వేస్తుంది, ఉరకలేస్తుంది మా కేడర్ అంతా అని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధర్మాన ప్రసాదరావు నమ్మకం వ్యక్తం చేశారు. చంద్రబాబు విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తారని, జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే పరిస్థితి వస్తుందని అన్నారు. తన ఫస్ట్ కోరిక ఏంటంటే, శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలబడాలన్నారు. తమ ప్రాంత సంపదను ఇతరులు దోచుకుపోకుండా, స్థానిక ప్రజలకు అవకాశాలు దక్కేలా పోరాటం చేస్తానన్నారు.

అధికారంలో ఉన్నా, లేకపోయినా నా వాయిస్‌ని వినిపిస్తూనే ఉంటాను. అది నా చివరి కోరిక అని భావోద్వేగంగా చెప్పారు. తన కుమారుడు స్థానిక సంస్థలు లేదా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించినప్పటికీ, తాను మాత్రం పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ధర్మాన ప్రసాదరావు పునరుద్ఘాటించారు. న 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎప్పుడూ ఆశించలేదని ధర్మాన ప్రసాదరావు అన్నారు. తన పేరు బయట వినిపించిందే తప్ప, కేంద్ర నాయకత్వం తనను ఎప్పుడూ సంప్రదించలేదని, తాను దానికోసం ప్రయత్నించలేదని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *