Headlines

స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెల రోజుల్లో ప్రమోషన్లు!


ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. అర్హత ఉన్న ఉద్యోగులకు నెల రోజుల్లోగా పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలో సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా పదోన్నతులు, జీతాలు, సర్వీస్‌ సమస్యలు తదితర అంశాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఇటీవలే ఆరేళ్ల సీనియారిటీ ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (AAS) అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్‌సీ నిబంధనల ప్రకారం స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ వర్తింపజేయాలని ఆదేశించింది.

అయితే ప్రమోషన్లు లేకపోవడం, ప్రొబేషన్‌ ఆలస్యం, ఇంక్రిమెంట్లు, జీతాల పెంపు వంటి అంశాలపై ఉద్యోగులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AAS కింద రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్రొబేషన్‌ ఆలస్యానికి సంబంధించిన ప్రయోజనాలు, మెరుగైన ప్రమోషన్‌ ఛానల్‌ తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం గమనార్హం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *