Headlines

Viral Video: స్కూల్‌ పక్కనుంచి వెళ్లిన వినాయక ఊరేగింపు.. క్లాస్‌లో ఒక్కసారిగా కుప్పకూలిన బాలిక..


పండగలు, ఫంక్షన్ల సమయంలో సరదా కోసం మనం వాడే డీజే బాక్స్‌లు ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారాయి. ఈ బాక్స్‌ల నుంచి వచ్చే భారీ శబ్దాలకు గుండె పగిలి జనాలు చనిపోతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా యూపీలోనూ ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. వినాయక ఊరేగింపు జరుగుతున్న క్రమంలో క్లాస్‌ రూమ్‌లోని ఓ విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే డీజే సౌండ్ కారణంగానే బాలిక గుండె ఆగిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అసలేం జరిగిందంటే? యూపీలోని బలరాంపూర్‌లో జరిగింది ఈ ఘటన. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని డివైన్ పబ్లిక్ స్కూల్‌ పక్క నుంచి గణనాథుడిని డీజే సౌండ్‌లతో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో స్కూల్‌లోని రెండో తరగతి చదువుతున్న వైష్ణవి అనే బాలిక క్లాస్‌ రూమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. అది గమనించిన క్లాస్ టీచర్.. విషయాన్ని వెంటనే తోటి ఉపాధ్యాయులకు చెప్పడంతో వారంతా కలిసి.. బాలికను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించారు.

అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారి అప్పటికే గుండెపోటు కారణంగా మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే బాలిక క్లాస్‌లో ఉన్న సమయంలో బయట వినాయక ఊరేగింపు నుంచి భారీ డీజే శబ్దాలు వచ్చినట్టు క్లాస్ టీచర్స్, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. విద్యార్థిని అస్వస్థతకు గురైన సమయంలో క్లాస్‌లోని మిగతా విద్యార్థులు బయట నుంచి వెళ్తున్న ఊరేగింపును చూస్తున్న దృశ్యాలను కూడా మనం సీసీటీవీలో చూడవచ్చు.

వీడియో చూడండి..

అయితే కేవలం సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా డీజే సౌండ్ కారణంగా బాలిక మృతి చెందిందని నిర్ధారించలేమని నివేదికలు పేర్కొన్నాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక మృతికి గల అసలు కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. వారు కూడా డీజే సౌండ్ కారణంగానే బాలిక మృతి చెందిందని ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు జారీ చేయలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *