Headlines

అమ్మబాబోయ్..!స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.!! శ్రీకాంత్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?


టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలతో పాటు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో కొనసాగుతున్నారు. హీరోగా అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు కథకు కీలకమైన పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ వారసుడిగా ఆయన కుమారుడు రోషన్ ఇప్పటికే సినీ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రోషన్.. తొలి సినిమాలతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నరోషన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా శ్రీకాంత్ కుటుంబానికి సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్ కుమార్తె మేధా ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..

ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మేధా గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మేధా ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఆమె విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తూ బిజీగా ఉంది. ఆమె చదువు, కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. సినిమా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. హీరోయిన్‌గా సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ప్రస్తుతం మేధాకు లేదని తెలుస్తోంది. నటనపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో సినీ రంగ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో సినిమాల గురించి ఆలోచించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి



అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

మేధాకు చదువుతో పాటు కళలు, క్రీడలపై కూడా ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నతనం నుంచే ఆమె డాన్స్ లో శిక్షణ తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా బాస్కెట్‌బాల్‌లోనూ ఆమె మంచి ప్రతిభ కనబరిచారు.  బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీంతో మేధా కేవలం సినీ కుటుంబానికి చెందిన అమ్మాయిగానే కాకుండా చదువు, క్రీడలు, కళలపై ఆసక్తి ఉన్న వ్యక్తిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మేధా సినిమాల్లోకి వస్తారా? లేదా తన చదువు, కెరీర్‌నే కొనసాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆమెకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానుల హడావిడి కనిపిస్తుంది. మరి భవిష్యత్తులో మేధా సినీ రంగంలోకి అడుగుపెడతారో లేదో చూడాలి.

ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *