Headlines

సర్కారు బడిలోకి ఎంట్రీ ఇచ్చిన రోబో..ఇక టీచర్‌ ఉద్యోగాలనూ


మొన్న గోరింటాకు పెట్టింది… నిన్న సెలూన్‌లో కటింగ్‌ వేయడం నేర్చుకుంది… ఇవాళ స్కూల్లో అడుగుపెట్టి చకచకా పాఠాలు చెప్పేస్తుంది.అదే ఏఐ… రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక అరుదైన, వినూత్న ప్రయోగానికి వేదికైంది. పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఒక ‘రోబో టీచర్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఇండస్ ల్యాబ్’ సంస్థ పాఠశాలకు బహూకరించిన ఈ రోబో టీచర్, తొలిసారిగా విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. పాఠశాలలో విద్యాబోధన, పిల్లల ప్రగతి, డిజిటల్ విద్య ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ రోబో టీచర్ ఎంతో స్పష్టంగా, ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది. సాధారణంగా ఉపాధ్యాయులతో జరిగే సమావే శాలకు భిన్నంగా, రోబోతో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమం తల్లిదండ్రుల్లో ఎంతో కుతూహలాన్ని నింపింది. విద్యార్థులకు ఎంతో క్లిష్టమైన పాఠ్యాంశాలను సైతం సులభంగా, ఆకట్టుకునేలా బోధించడానికే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సర్కారు బడుల్లో ఆధునిక బోధనా పద్ధతులు రావడం అభినందనీయమని కొనియాడారు. సాంకేతికత ఆధారిత విద్యపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం విజయం సాధించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైద్యం కోసం వస్తే ప్రాణాలకే ముప్పు! పెద్దాసుపత్రిలో ఏం జరుగుతోంది?

హీరో నాని రిక్వెస్ట్‌.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్‌ రద్దు చేసుకున్న నాని!

దడ పుట్టిస్తున్న వాయుగుండం.. తీరంలో రాకాసి అలల బీభత్సం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

గుడ్‌ న్యూస్‌.. గ్యాస్ సిలిండర్‌పై వారికి రూ.600 తగ్గింపు!

సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్‌ పైనా కేంద్రం కొత్త రూల్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *