Headlines

దసరాకు ఏపీ – తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు..


దసరా, దీపావళి పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మార్గంలో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. షెడ్యూల్ వివరాల ప్రకారం.. చర్లపల్లి – శ్రీకాకుళం రైలు అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం – చర్లపల్లి రైలు అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో మరియు నవంబర్ 4, 11, 18, 25 తేదీల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం తదితర కీలక స్టేషన్లలో ఆగుతాయి. వీటితో పాటు దక్షిణాది వైపు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి – నాగర్‌కోయిల్ మార్గంలోనూ 10 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. 07535 నెంబరు రైలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 వరకు ప్రతి శుక్రవారం, అలాగే తిరుగు ప్రయాణంలో 07536 నెంబరు రైలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. పండుగ సమయంలో ప్రయాణించే వారు ఈ ప్రత్యేక రైలు సర్వీసుల అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ వినియోగదారులకు అలర్ట్‌.. సిలిండర్‌ పొందాలంటే.. అది తప్పనిసరి

Pulasa Fish: బంగారంతో పోటీపడుతున్న పులస..

సర్కారు బడిలోకి ఎంట్రీ ఇచ్చిన రోబో..ఇక టీచర్‌ ఉద్యోగాలనూ

వైద్యం కోసం వస్తే ప్రాణాలకే ముప్పు! పెద్దాసుపత్రిలో ఏం జరుగుతోంది?

హీరో నాని రిక్వెస్ట్‌.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్‌ రద్దు చేసుకున్న నాని!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *