Headlines

5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా!


భారత్‌లో జుగాడ్‌లకు కొదువ లేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక మెకానిక్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సాధారణ మారుతి ఆల్టో కారును ఏకంగా 7 సీట్ల ఓపెన్-టాప్ జిప్సీగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఆల్టో కారు పైకప్పును, వెనుక భాగాన్ని పూర్తిగా తొలగించి, దానికి అదనపు సీటింగ్ అమర్చి ఒక రఫ్ అండ్ టఫ్ ఆఫ్-రోడ్ జిప్సీ లుక్‌ను తీసుకొచ్చాడు. ఈ వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆల్టో కాస్తా ఓపెన్-టాప్ జిప్సీలా ఎలా మారింది?

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, పాత మారుతి ఆల్టో కారు రూపురేఖలను పూర్తిగా మార్చేయడం కనిపిస్తుంది. కారు పైకప్పు వెనుక డోర్లను పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత కారు వెనుక భాగంలో అదనపు సీట్లను అమర్చి, ఓపెన్-టాప్ జీప్ లేదా జిప్సీ తరహా డిజైన్‌ను రూపాందించారు. దీనికి రఫ్ అండ్ టఫ్ లుక్ ఇవ్వడానికి బాడీ పెయింటింగ్, ఫ్రంట్ బంపర్, కొత్త టైర్లను అమర్చారు. చూడటానికి ఇది ఒక విలాసవంతమైన లేదా మిలిటరీ తరహా జిప్సీలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి



ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆ మెకానిక్ టాలెంట్‌ను, సృజనాత్మకతను ఆకాశానికెత్తేశారు. తక్కువ బడ్జెట్‌లో పెద్ద ఫ్యామిలీ కోసం ఇది అద్భుతమైన ఐడియా అని కొందరు కామెంట్ చేయగా, ఇండియన్ జుగాడ్ నెక్స్ట్ లెవల్ అని మరికొందరు ప్రశంసించారు.

ఇలాంటి మోడిఫికేషన్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇవి చట్టరీత్యా నేరం. వాహనం ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడం భారతీయ రహదారులపై నిషేధించబడింది.
కారు రూఫ్‌ను తొలగించడం వల్ల కారు పల్టీ కొట్టినప్పుడు ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్ వంటి భద్రతా ప్రమాణాలు ఇందులో లోపిస్తాయి. రవాణా శాఖ (RTO) అనుమతి లేకుండా ఇలాంటి మార్పులు చేసిన వాహనాలను పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది.

ఏది ఏమైనా, భారతదేశంలో కళ, సృజనాత్మకతకు కొదవలేదనడానికి ఈ ఆల్టో-టు-జిప్సీ మోడిఫికేషన్ మరొక నిదర్శనం. అయితే ఇలాంటి వాహనాలను వ్యక్తిగత ప్రాంగణాల్లో లేదా ప్రదర్శనలకు ఉపయోగించడం ఓకే కానీ, రహదారులపై నడపడం మాత్రం సురక్షితం కాదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *