Headlines

Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!


డెంగ్యూ వ్యాధి కట్టడికి వైద్య రంగంలో కీలక అడుగు పడింది. జపాన్‌కు చెందిన ప్రముఖ డ్రగ్‌మేకర్ టకేడా సంస్థ రూపొందించిన ‘క్యూడెంగా’ టీకా త్వరలోనే భారతీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ వ్యాక్సిన్ పంపిణీ నిమిత్తం టకేడా సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటికే ఆమోదం లభించడంతో, 2027 తొలి నాళ్లలో ఇది ప్రైవేట్ హెల్త్‌కేర్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. నాలుగు నుంచి అరవయ్యేళ్ల వయసు గలవారు దీన్ని వినియోగించవచ్చని నిపుణులు తెలిపారు. ఈ టీకా కేవలం అదనపు బలంగా మాత్రమే ఉపయోగపడుతుందని, దోమల నివారణ వంటి ఇతర ప్రజారోగ్య ముందస్తు చర్యలకు ఇది ప్రత్యామ్నాయం కాదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో డెంగ్యూ వ్యాధి ప్రధాన సమస్యగా మారుతూ రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన ఇరవై ఏళ్లలో దేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య సుమారు పదకొండు రేట్లు పెరిగినట్లు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో మూడో వంతు ఒక్క భారత్‌లోనే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాధి నియంత్రణకు నివారణ చర్యలు అత్యంత కీలకమయ్యాయి. ఎన్‌పీజే వ్యాక్సిన్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. TAK-003గా పిలిచే ‘క్యూడెంగా’ వ్యాక్సిన్ డెంగ్యూ వైరస్‌లోని నాలుగు సెరోటైప్‌లైన DENV-1, DENV-2, DENV-3, DENV-4 నుండి సమర్థవంతంగా రక్షణ కల్పిస్తుంది. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇచ్చే ఈ టీకా ప్రత్యేకత ఏమిటంటే, గతంలో డెంగ్యూ సోకిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా నేరుగా ఎవరైనా తీసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రీక్వాలిఫికేషన్ పొందిన ఈ వ్యాక్సిన్ మహమ్మారి కట్టడిలో కీలకం కానుంది. ఈ క్యూడెంగా వ్యాక్సిన్ రావడంతో మన దేశంలో డెంగ్యూ నివారణకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అయితే, ఈ టీకా అనేది ఇప్పటికే ఉన్న ప్రజారోగ్య చర్యలకు అదనపు బలాన్ని ఇస్తుందే తప్ప వాటిని రీప్లేస్ చేయదని.. అధికారులు చెబుతున్నారు. దీనిలో పాటు దోమల నియంత్రణ, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను తగ్గించడం, వ్యాధి పర్యవేక్షణ, ముందస్తు వ్యాధి నిర్ధారణ, సకాలంలో చికిత్స తీసుకోవడం చేస్తేనే.. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోగలం అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు

ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!

ఏంట్రా ఇది.. అదేమైనా బస్సా.. విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..

రోబోల చేతికి కత్తెర? బార్బర్‌ ఉద్యోగాలూ గో..వింద!

ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న అల్పపీడనం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *