Headlines

Asian Games 2026: 13 ఏళ్ల వయసులోనే అద్భుతం.. ఏషియన్ గేమ్స్‌లో రెండో స్వర్ణ పతకం సాధించిన చైనా చిన్నారి


Asian Games 2026: ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో చాలా మంది పిల్లలు 13 ఏళ్ల వయసులో కేవలం ఆటపాటలతో కాలం గడుపుతుంటారు. కానీ చైనాకు చెందిన 13 ఏళ్ల చిన్నారి స్విమ్మర్ యూ జిది (Yu Zidi) మాత్రం అంతర్జాతీయ వేదికపై సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 (Asian Games 2026)లో ఆమె తన అద్భుతమైన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ మహా క్రీడా ఉత్సవంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఈ టీనేజ్ అమ్మాయి, తాజాగా సోమవారం నాడు తన ఖాతాలో రెండో స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. ఆమె చూపుతున్న ఈ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రపంచ స్విమ్మింగ్ రంగాన్ని ఆమె ఏలడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మహిళల 200 మీటర్ల మెడ్లీ రేస్‌లో స్వర్ణం

సోమవారం జరిగిన మహిళల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్‌లో యూ జిది అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఆమె ఈ కేవలం 2 నిమిషాల 6.10 సెకన్ల వ్యవధిలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. దీని ద్వారా ఆమె సరికొత్త ఏషియన్ గేమ్స్ రికార్డును తన పేరున రాసుకుంది. అంతేకాకుండా, కెనడాకు చెందిన స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెక్‌ఇంతోష్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడానికి అతి సమీపంగా వెళ్లి తృటిలో కోల్పోయింది. అయినప్పటికీ, మహిళల 200 మీటర్ల మెడలే చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన సమయంగా నిలిచింది.

వెంకంటైన్ రికార్డు బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర

ఈ ఏషియన్ గేమ్స్‌లో యూ జిదికి ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు రోజు జరిగిన మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలోనూ ఆమె కేవలం 2 నిమిషాల 5.08 సెకన్లలో రేసును ముగించి పసిడి పతకం సాధించింది. ఆ ఈవెంట్‌లో ప్రత్యర్థులకంటే దాదాపు మూడు సెకన్లు ముందంజలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, అంతటి గొప్ప విజయం సాధించిన తర్వాత ఆమె మాట్లాడతూ.. తన ప్రదర్శన సాధారణంగానే ఉందని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆమెలోని ఈ ఆత్మవిశ్వాసమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది.

భవిష్యత్ ఒలింపిక్స్ లక్ష్యంగా చైనా కొత్త సంచలనం

ప్రస్తుతం కెనడాకు చెందిన సమ్మర్ మెక్‌ఇంతోష్ 200 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల మెడలే విభాగాల్లో ప్రపంచ రికార్డులను కలిగి ఉన్నారు. కానీ, రాబోయే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, వచ్చే ఏడాది హంగరీలోని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. చిన్న వయసులోనే ఆసియా క్రీడల్లో అసాధారణ రికార్డులు సృష్టిస్తున్న యూ జిది, చైనా తరఫున రాబోయే కాలంలో మరిన్ని పతకాలు సాధించిపెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న వయసులో ఆమె సాధిస్తున్న ఈ విజయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *