ఆయుర్వేదంలో, నిత్య వంటకాలలో కలోంజీ లేదా నల్ల జీలకర్ర కు ఎంతో ప్రాధాన్యత ఉంది. చిన్నగా, నల్లగా కనిపించే ఈ గింజల్లో శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నిండి ఉన్నాయి. రోజూ పరిమిత పరిమాణంలో కలోంజీని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జుట్టు రాలడం తగ్గించడంలో, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కలోంజీ వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం.