Headlines

BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?


BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నామినేషన్ గరం గరంగా సాగుతున్నాయి. తొలి రోజు నుంచే హౌస్ మేట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. నామినేషన్ ప్రక్రియ మొదలవగానే హౌస్ మేట్స్ మధ్య విభేదాలు బయట పడ్డయి. అలాగే తొలి వారం హౌస్ నుంచి నుంచి ఎవరు బయటకు వచ్చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హౌస్ మొత్తం 16మంది హౌస్ మేట్స్ ఉన్నారు. వారిలో 10 మంది సెలబ్రెటీలు, ఆరుగురు సామాన్యులు హౌస్ లో ఉన్నారు. అయితే తొలివారం హౌస్ నుంచి సెలబ్రెటీ బయటకు వస్తాడా లేక సామాన్యుడు బయటకు వస్తా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయినట్టు సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

శనివారం నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ ఆట తీరు గురించి వివరించడం, అలాగే ఎవరైనా తప్పు చేస్తే క్లాస్ తీసుకోవడం చేస్తారు. అలాగే కొన్ని గేమ్స్ కూడా ఆడిస్తారు. అలాగే నామినేషన్స్ లో ఉన్న వారిని ఒకొక్కరిగా సేవ్ చేస్తూ ఉంటారు. ఇక ఆదివారం కూడా ఇదే జరుగుతుంది. కానీ నామినేషన్స్ లో భాగంగా ఒకరిని హౌస్  నుంచి ఎలిమినేట్ చేస్తారు.

అయితే ఈసారి నామినేషన్స్ లో 16 మంది ఉన్నారు. కాగా ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తుంది. అయితే హౌస్ మేట్స్ ఛాయిస్ ఓటింగ్ లో ఆటో రామ్ ప్రసాద్ , చరణ్ మధ్య పోటీ జరిగిందని తెలుస్తుంది. ఈ ఇద్దరికీ మిగిలిన హౌస్ మేట్స్ ఓట్లు వేయాల్సి ఉంటుంది. దాంతో రామ్ ప్రసాద్ కు హౌస్ మేట్స్ ఎక్కువగా ఓటు వేయడంతో చరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది. కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన చరణ్ మహాదేవ్ తొలి వారమే మిడ్ వీక్ లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో శనివారం లేదా ఆదివారం క్లారిటీ వచ్చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *