Headlines

పాన్ ఇండియాన్ సినిమాలతో నిజంగా నిర్మాతలకు డబ్బులు వస్తున్నాయా?


ప్యాన్ ఇండియా చిత్రాలు భారీ అంచనాలతో విడుదలవుతున్నప్పటికీ, అవి నిజంగా తమ పేరుకు తగ్గ కంటెంట్‌ను అందిస్తున్నాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో మ్యాజిక్ సృష్టించలేకపోతున్నాయి. ఒక్కో సినిమా కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. దీనికి విరుద్ధంగా, తక్కువ సమయంలో పూర్తయ్యే రీజనల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధిస్తున్నాయి.వేల మంది శ్రమ, వందల కోట్ల పెట్టుబడి, రెండు మూడేళ్ల సమయం – ఇదంతా ఒక్క ప్యాన్ ఇండియా సినిమా కోసం దర్శకులు పడుతున్న కష్టం. అయితే, ఇంత కష్టానికి తగిన ఫలితాలు కనిపించడం లేదు. కంటెంట్‌పై దృష్టి పెట్టకుండా కేవలం ఖర్చుల మీదనే ఫోకస్ పెడితే నష్టాలు తప్పవని రుజువవుతోంది. కొన్నేళ్లుగా తెలుగులో ఇదే జరుగుతోంది. స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చారు కదా అని సరైన కథ లేకుండానే కొందరు దర్శకులు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులను మొదలుపెడుతున్నారు.వీటి ఫలితంగా గేమ్ ఛేంజర్, వార్ 2, రాజా సాబ్, ఆదిపురుష్, హరిహర వీరమల్లు వంటి అనేక చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ వైఫల్యాలను మరపించేలా రీజనల్ సినిమాలే విజయాలు సాధిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *