మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ గనుకు ఉంటే అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. మీ ఫోన్‌లో లోకేషన్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేసి స్క్రీన్‌పై మీ ప్రస్తుత లొకేషన్‌ను చూపే బ్లూ డాట్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక మెనూ కనిపిస్తుంది, అందులో సేవ్ పార్కింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. వెంటనే మ్యాప్‌పై P అనే పార్కింగ్ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు కారు పార్క్ చేసిన పిల్లర్ నెంబర్, ఫోర్ డీటెయిల్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే కారు పార్క్ చేసిన ప్రదేశం ఫోటోను కూడా యాడ్ చేయవచ్చు.