బుల్లితెర ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో గ్రాండ్ లాంఛ్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 స్టార్టింగ్ నుంచే సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని హోస్ట్ నాగార్జునతో పాటు నిర్వాహకులు కూడా మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇది నిజం చేస్తూ గ్రాండ్ లాంఛింగ్ రోజే అదిరేపోయే ట్విస్ట్ లు ఇచ్చారు బిగ్ బాస్ మేకర్స్. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ కు సంబంధించి ప్రోమో రిలీజైంది.ఇందులో దశావతారం కాన్సెప్టుగా తగ్గట్టుగా రెడీ చేసిన బిగ్ బాస్ హౌస్ ను చూపించారు.
ఇక హౌస్ లోకి నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే ఓ రోబో వెల్ కమ్ చెప్పడం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది. ఈ లాంఛ్ ఎపిసోడ్ కు సర్దార్ టీమ్ హీరో కార్తి, ఎస్ జే సూర్య గెస్ట్ లుగా వచ్చారు. ఇక హౌస్ లోకి రాగానే కంటెస్టెంట్లకు టాస్క్ లు పెట్టారు బిగ్ బాస్.
10వ సీజన్ కాబట్టి పది పవర్స్ ను కంటెస్టెంట్ల కోసం సెట్ చేశారు మేకర్స్. ఆ పవర్ బాక్స్ లను సొంతం చేసుకోవాలంటే కీస్ గెలుచుకోవాలి. బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో విన్నర్ గా నిలిచిన సింగర్ ఝాన్సీ ఈ పవర్ టాస్క్ లోనూ తనదైన స్టైల్ లో అదరగొట్టింది.
ఝాన్సీతో పాటు పలువురు సీరియల్ స్టార్స్, జబర్దస్త్ కమెడియన్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ లు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగు పెట్టినట్లు ప్రోమోలో చూపించారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్ రోజే మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ ప్రోమోను జాగ్రత్తగా గమనిస్తే ఓ కంటెస్టెంట్ స్టేజీ పైనుంచే ఎలిమినేట్ అయి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ కంటెస్టెంట్ వాయిస్ ని బట్టి అతను జబర్దస్త్ రామ్ ప్రసాద్ అని సమాచారం. ఎంటర్ టైన్ చేయనందుకు రాంప్రసాద్ ను ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించడం ఈ ప్రోమోలో చూపించారు. మరి ఇందులో ఉన్న మతలబు ఏంటో తెలుసుకోవాలంటే ఇవాళ్టి గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే.
మరోవైపు తెలుగు బిగ్‌బాస్‌తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ బిగ్‌బాస్ షోలు ఇదే రోజు ప్రారంభం కానున్నాయి. ఆయా భాషల హోస్టులు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్.. నాగార్జునతో వర్చువల్‌గా భేటీ కావడం కూడా ప్రోమోలో హైలెట్ గా నిలిచింది.
ఇవి కూడా చదవండి
బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ లాంచ్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.