Headlines

సెప్టెంబర్ 5 రాశిఫలాలు: ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగ విషయంలో గుడ్ న్యూస్


దిన ఫలాలు (సెప్టెంబర్ 5, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. మిథున రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సానుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. కొందరు బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆర్థికపరంగా అనుకూల వాతావరణం నెలకొని ఉంది. పోటీదార్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు సవ్యంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

ఇవి కూడా చదవండి



మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన సానుకూల ఫలితాలనిస్తాయి. మిత్రుల వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇంటా బయటా అదనపు బాధ్యతలుంటాయి. మానసిక ఒత్తిడికి అవకాశముంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొంటుంది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త అవకాశాలు అందివస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు, స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల బాగాలాభం ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఎటూ నిర్ణయం తీసుకోలేక కొద్దిగా ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సాయం లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. కొందరు బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభకార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులు, వినోదాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. విదేశాల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, మద్య వ్యాపారులు బాగా బిజీ అవుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వీలైతే ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, ప్రశాంతంగా సాగిపోతుంది.

కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. వ్యాపారాల్లో కొద్దిగా ప్రతి కూలతలు కనిపిస్తాయి. పోటీదార్ల నుంచి ఇబ్బందులెదురవుతాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. స్తోమతకు మించి స్నేహితులకు సహాయపడతారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *