Headlines

Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే మీ నెలవారీ ఖర్చు సగం తగ్గుతుంది.. డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు..


కొన్నిసార్లు అవసరం లేకపోయినా వస్తువులు కొనుగోలు చేయడం, ఆఫర్లు, డిస్కౌట్ల మోజులో పడి విచ్చలవిడిగా చేసే కొనుగోళ్లు మీ ఖర్చును మరింత పెంచుతాయి. రూ. 500, రూ. రూ.1,500 లాంటి కొనుగోళ్లు మీకు తక్కువగా అనిపించినప్పటికీ.. నెల తిరిగే సరికి అవే అధిక ఖర్చును చూపిస్తాయి. ఇది మీ నెలవారీ బడ్జెట్‌ను తీవ్ర దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఆఫర్లకు ఆకర్షితులై వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటిని కొన్ని రోజులు వాడి ఆ తర్వాత పక్కన పడేస్తారు. ఇలాంటివి కూడా మీ ఖర్చును మరింత పెంచి పొదుపు హరించేస్తాయి. దీంతో అనవసరపు ఖర్చుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జీతం పడగానే ఏం చేయాలి..?

మీ జీతం పడిన వెంటనే అధిక ఖర్చు చేయకండి. శాలరీ అకౌంట్లో పడగానే ముందుగా అవసరమైన బిల్లులు చెల్లించండి. ఆ తర్వాత మీ పొదుపు, పెట్టుబడులను పక్కన పెట్టండి. మిగిలిన వాటిని రోజువారీ సాధారణ ఖర్చులు కోసం ఉపయోగించుకోండి. డబ్బులు పొదుపు చేసుకునేందుకు ఒక ప్రత్యేక పొదుపు ఖాతాను తీసుకోండి. మీ జీతం జమ అయిన వెంటనే కొంత మొత్తాన్ని అందులోకి బదిలీ చేసుకోండి. అప్పుడు ఆ డబ్బు మీ కంటికి కనిపించకుండా ఉంటుంది. దీని వల్ల మీరు అనవసర ఖర్చులు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. షాపింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆఫర్లను చూసి మోసపోకండి. ఏదైనా కొనే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మంచి డీల్‌కు, అనవసరమైన ఖర్చుకు మధ్య తేడాను గుర్తించండి. క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ ఒక కొనుగోలు ఆర్థిక అంశాలను మెరుగుపరుస్తాయి. కానీ కొనుగోలు చేయడానికి అదే ఏకైక కారణం కాకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు..

ఏమైనా పెద్ద వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకోకండి. కొంత విరామం తీసుకోవడం మీరు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరం లేని పెద్ద వస్తువులను కొనుగోలు చేసేముందు ఒకటి రెండు రోజులు ఆగండి. మీకు ఆ వస్తువు కావాలని ఇంకా అనిపిస్తే అప్పుడు కొనుగోలు చేయండి. అకస్మాత్తుగా వచ్చే ఆఫర్‌ను తీసుకోవడం నిజంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. కానీ ఒకే నెలలో అనేక ఆఫర్లు రావడం వల్ల మీ నగదు ప్రవాహంపై త్వరగా ఒత్తిడి పడవచ్చు. రాబోయే బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు భంగం కలగకుండా ఖర్చులు చేయండి. ఇలాంటి కొన్ని చిట్కాలు తీసుకోవడం వల్ల మీరు అధిక ఖర్చును తగ్గించుకుని డబ్బులు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *