Headlines

పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..! పుట్టినరోజున ఫోన్ చేసి ఏం చెప్పారంటే..?


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా పవన్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.

చంద్రబాబు తన సందేశంలో పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పవన్ నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. ఇక పవన్ పుట్టినరోజున చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

ప్రస్తుతం కేరళలో పవన్ కల్యాణ్

ప్రస్తుతం పవన్ కల్యాణ్ కేరళలో ఉన్నారు. ఇటీవల ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. ఆ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. శస్త్రచికిత్స అనంతర చికిత్సలో భాగంగా ఫిజియోథెరపీతో పాటు ఆయుర్వేద చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం కేరళలో ఉంటూ చికిత్స కొనసాగిస్తున్నారు.

ఈసారి కేరళలోనే పుట్టినరోజు

చికిత్స, విశ్రాంతి కారణంగా పవన్ కల్యాణ్ ఈసారి తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. సాధారణంగా పవన్ జన్మదినం సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి పవన్ స్వయంగా వేడుకలకు దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్
ఇదిలా ఉండగా.. పవన్‌కు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌ను సినీ అభిమానులకు ‘పవర్ స్టార్’, జనసైనికులకు ‘సేనాని’, తనకు దేవుడిచ్చిన అన్నయ్యగా లోకేష్ అభివర్ణించారు. ఆయన ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *