ధనుష్ అభిమానులకు శుభవార్త. ఆయన మాస్ యాక్షన్ ఫ్రాంచైజీ మారి మూడవ భాగం తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. మారి, మారి 2 చిత్రాల విజయాల తర్వాత, ఎనిమిదేళ్ల విరామం అనంతరం మారి 3ని భారీ స్థాయిలో రూపొందించడానికి మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. రీసెంట్ కాలంలో క్లాస్, విభిన్న జానర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ధనుష్, మారి 3తో తిరిగి తన మాస్ ఇమేజ్ను చాటనున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ధనుష్ స్వయంగా డైరెక్టర్ బాలాజీ మోహన్‌కు ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్‌ను అందించారు. ప్రస్తుతం బాలాజీ మోహన్ దానిని పూర్తిస్థాయి స్క్రిప్ట్‌గా అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, 2027 ప్రథమార్ధంలో సినిమాను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ మారి 3కి తిరిగి సంగీతం అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
ముస్తాబైన ఖైరతాబాద్ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా
పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?