Headlines

జైలర్ 2 రీ షూట్స్ వెనక అసలు కారణం అదేనా..?


సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రం ప్రస్తుతం రీషూట్స్ జరుపుకుంటోందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ రీషూట్స్ వెనుక అసలు కారణం తమిళ రాజకీయాలకు సంబంధించిన సున్నితమైన సన్నివేశాలను తొలగించడమేనని తెలుస్తోంది. తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ వివాదాలకు తావు లేకుండా ఈ మార్పులు చేస్తున్నారని సమాచారం.రజనీకాంత్ రాజకీయాల్లో లేనప్పటికీ, ఆయన పేరు తరచుగా రాజకీయ చర్చల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే, మొదటి భాగం సాధించిన అద్భుతమైన విజయం దృష్టిలో పెట్టుకొని, సీక్వెల్‌లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చిత్ర బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది. అనురుద్ రవిచందర్ తనదైన శైలిలో ఈ చిత్రానికి మరోసారి శక్తివంతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటి భాగంలో నటించిన వారితో పాటు, కథకు కీలకంగా మారే కొంతమంది కొత్త నటీనటులను నెల్సన్ పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా, మలయాళ నటి అన్నా రేష్మా రాజన్ లేడీ విలన్‌గా కనిపించబోతుండగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఒక క్యామియో పాత్రలో మెరవనున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *