Headlines

Video: 41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!


Prabhsimran Singh: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో జలంధర్ వారియర్స్ కెప్టెన్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ విధ్వంసక శతకంతో అదరగొట్టాడు. మొహాలీలో అమృత్‌సర్ సూర్మాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని జలంధర్ కేవలం 16.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రబ్‌సిమ్రన్ 47 బంతుల్లో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 16 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు 41 బంతుల్లో సెంచరీ సాధించాడు. మరోవైపు అమృత్‌సర్ తరపున నమన్ ధీర్ 117, కెప్టెన్ అభిషేక్ శర్మ 82 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 264/5 భారీ స్కోరు చేసింది. అయినా ప్రబ్‌సిమ్రన్, అన్మోల్ మల్హోత్రా ధాటికి జలంధర్ లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుంది.

16 బంతుల్లోనే అర్ధశతకం..

265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జలంధర్‌కు ప్రబ్‌సిమ్రన్ దూకుడు ఆరంభం అందించాడు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌తో కలిసి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అనంతరం హర్జస్ సింగ్-టాండన్‌తో కలిసి రెండో వికెట్‌కు 109 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మరో 25 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన ప్రబ్‌సిమ్రన్ 125 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు.

ఇవి కూడా చదవండి



Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

265 పరుగుల లక్ష్యం.. 19 బంతులు మిగిలుండగానే..

అమృత్‌సర్ తొలుత 264/5 సాధించింది. నామన్ ధీర్ 56 బంతుల్లో 117 పరుగులతో శతకం చేయగా, అభిషేక్ శర్మ 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 151 పరుగులు జోడించారు.

జలంధర్ ఛేజ్‌లో హర్జస్ 42 పరుగులు చేయగా, అన్మోల్ మల్హోత్రా 23 బంతుల్లో 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రబ్‌సిమ్రన్‌తో కలిసి అతడు జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తం 529 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో జలంధర్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.

Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్‌ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్‌‌లో ఒంటి చేత్తో..!

ప్రబ్‌సిమ్రన్‌ ఇన్నింగ్స్‌కు మరో సందర్భం కూడా ఉంది. జింబాబ్వే పర్యటనకు భారత టీ20 జట్టులో అతడికి చోటు లభించినప్పటికీ, ఆ సిరీస్‌లో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అనంతరం అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడు లేడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *