కొంతమంది హీరోయిన్స్ ఊహించని విధంగా చిక్కుల్లో పడుతూ ఉంటారు. కావాలని చేస్తారో లేక తెలియక చేస్తారో కానీ సెలబ్రెటీలు చేసే చిన్న చిన్న తప్పులు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతాయి. ఒక సెలబ్రెటీ చిన్న కామెంట్ చేసిన లేదా ఏదైనా తప్పు చేసిన ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు నెటిజన్స్. సోషల్ మీడియాలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ మీద ట్రోల్ల్స్ జరిగాయి. కొంతమంది వాటిని పట్టించుకోరు.. కానీ మరికొంతమంది వాటి వల్ల ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. నువ్వు సెలబ్రెటీ అయ్యుండొచ్చు.. కానీ గుడిలో ఎలా ఉండాలో నేర్చుకో అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.. ఇంతకూ ఆమె ఎవరు.? ఏం చేసింది.? నెటిజన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారో చూద్దాం..!
బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్. హిందీలో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది భూమి పెడ్నకర్. ఓవైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తోందీ అందాల తార. దమ్ లగా కే హైసా, టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ, శుభ్‌మంగళ్ సావధాన్, సాంచారియా, సాండ్ కీ ఆంఖ్, బాలా, పతీ పత్నీ ఔర్ ఓ, దుర్గామతి, బదాయి హో, రక్షాబంధన్ ఇంకెలా చాలా సినిమాలు భూమి ఖాతాలో ఉన్నాయి. సినిమాల్లో తప్ప బయటి విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపని ఆమె ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాల్లో చిక్కుకుంటుంది.
తాజాగా భూమి ఫెడ్నేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఓ గుడిలోని శివలింగానికి భూమి అభిషేకం చేసింది. ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. కారణం ఏంటంటే ఈ భూమి గుడికి మోడ్రన్ డ్రస్ లో వెళ్లడమే కాకుండా గుళ్లో కూలింగ్ గ్లాస్ లు పెట్టుకొని ఉండటం పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుళ్లో కూడా అవసరమా.? ఎంత సెలబ్రెటీ అయితే మాత్రం దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.