దసరా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్’ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా కోసం తనకు బాగా కలిసొచ్చిన హిట్ పెయిర్ సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నారు నాని. ఇంతకీ ఎవరా పెయిర్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. దసరా సినిమాతో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ప్రెజెంట్ ‘ది ప్యారడైజ్’ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో తనకు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్స్‌ను రిపీట్ చేస్తున్నారు నాని. ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో తన లక్కీ కో-స్టార్‌కే మరోసారి ఓటేశారు న్యాచురల్ స్టార్. నేను లోకల్, దసరా సినిమాల్లో నాని-కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా దసరాలో వీళ్ల పెయిర్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. అందుకే మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీర్తి సురేష్‌ను ఓ స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేశారు. ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో మెప్పించిన మహానటి, ఫస్ట్ టైమ్ ఓ హై-వోల్టేజ్ మాస్ సాంగ్‌లో గ్లామర్ టర్న్ తీసుకోబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ పై ఆల్రెడీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్ మాస్ స్టెప్పులు వేయనుండటంతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుందన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో వెయ్యి మంది డ్యాన్సర్ల మధ్య ఈ పాటను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్
కర్నూలులో ఘరానా మోసం… తల్లికి వందనం సొమ్ము స్వాహా!
ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!
Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’
హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్.. స్టార్‌షిప్