Headlines

అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..

అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..


దానిమ్మ పండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన అమృతం లాంటిది. ఎర్రటి ముత్యాల్లా మెరిసే ఈ గింజల్లో విటమిన్ సీ, విటమిన్ కేతో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి అత్యవసర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, ఎముకలను బలోపేతం చేయడం, జీవక్రియను మెరుగుపరచడంలో దానిమ్మ పాత్ర వర్ణనాతీతం. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక ప్రాణరక్షక ఔషధంలా పనిచేస్తూ, శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే వైద్యులు ప్రతిరోజూ దానిమ్మ తినాలని సూచిస్తుంటారు. అంతేకాక దీనిలోని పునికలాగిన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మంలో కొల్లాజెన్‌ను పెంచి, ముడతలను తగ్గించి, యవ్వన కాంతిని ఇస్తుంది. అందుకే దీనిని సహజ సౌందర్య ఫలం అని కూడా పిలుస్తారు. ఇన్ని అద్భుత గుణాలున్న దానిమ్మ అందరికీ పడదు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మను తింటే తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని పద్మావతి నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ శివకుమార్ హెచ్చరిస్తున్నారు.

దానిమ్మ విషయంలో వీళ్లు జాగ్రత్తగా ఉండాలి..

లో బీపీ ఉన్నవారు

తక్కువ రక్తపోటుతో బాధపడేవారు దానిమ్మపండుకు దూరంగా ఉండటమే మంచిది. దానిమ్మకు రక్త ప్రవాహాన్ని మరింత తగ్గించే గుణం ఉంది. మీరు ఇప్పటికే బిపి పెంచడానికి మందులు వాడుతుంటే, దానిమ్మ తినడం వల్ల ఆ మందుల ప్రభావం తగ్గి కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కిడ్నీ – థైరాయిడ్ బాధితులు

మూత్రపిండాల సమస్యలు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది.

కాలేయ సమస్యలు ఉన్నవారు

కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు దానిమ్మను తమ ఆహారంలో చేర్చుకునే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

గ్యాస్, అజీర్ణం – కడుపు ఉబ్బరం ఉన్నవారు

గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు దానిమ్మను పరిమితంగానే తినాలి. దానిమ్మకు ఉండే చల్లదనపు గుణం జీర్ణక్రియను నెమ్మదింపజేసి, ఉన్న జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు..

చాలామంది ఉదయాన్నే పరగడుపున పండ్లు తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో దానిమ్మపండు తినడం మంచిది కాదు. అలా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పడి కడుపులో అసౌకర్యం, నొప్పి కలగవచ్చు.

దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, పరిమాణానికి మించి తీసుకుంటే హానికరం కాగలదు. మన శరీర తత్వానికి అనుగుణంగా, సరైన సమయంలో, మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే దానిమ్మ అసలైన రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు.

(గమనిక: ఈ కథనంలో అందించిన వివరాలు కేవలం సమాచారం, ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా లేదా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలన్నా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *