రీసెంట్ టైమ్స్‌లో మూవీ కలెక్షన్స్‌కు సంబంధించి డిస్కషన్ గట్టిగా జరగుతోంది. కొంతమంది స్టార్స్ బాక్సాఫీస్ నెంబర్స్ విషయంలో ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. సీనియర్స్, జూనియర్స్ అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ టాపిక్‌ను టచ్ చేస్తుండటంతో ఆడియన్స్‌లోనూ చర్చ మొదలైంది. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది. చెన్నై లవ్ స్టోరి సక్సెస్ మీట్‌కు గెస్ట్‌గా వచ్చిన నాగచైతన్య సినిమాల కలెక్షన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. పోస్టర్ల మీద నెంబర్ వేయటం కాదు. ఇది అసలైన సక్సెస్ అంటూ మూవీ టీమ్‌ను అభినందించారు. లవ్ స్టోరీతో ఇంత బిగ్ సక్సెస్ సాధించిన యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ‘పోస్టర్ల మీద నెంబర్లు వేసుకోవటం కాదు’ అన్న కామెంట్ ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయ్యింది. సినిమా సక్సెస్‌తో సంబందం లేకుండానే కొన్ని సినిమాలకు ఇలా నెంబర్స్ వేస్తున్నారా? అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. సినిమాల కలెక్షన్స్ పోస్టర్స్ విషయంలో చాలా రోజులుగా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు స్టార్స్ స్వయంగా ఇలాంటి కామెంట్స్ చేస్తుండటంతో ఆ డౌట్స్ మరింత పెరుగుతున్నాయి. రీసెంట్గా నాగార్జున కూడా ఇండస్ట్రీ పరిస్థితులపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. హాలీవుడ్ మేకర్స్ ఏడాది ముందే డేట్ లాక్ చేసి కూడా చెప్పిన టైమ్‌కు సినిమా రిలీజ్ చేస్తుంటే మన మేకర్స్ మాత్రం ఆన్ టైమ్ సినిమాను రిలీజ్ చేయలేకపోవటం మీద అసహనం వ్యక్తం చేశారు. ఇలా స్టార్ హీరోలు ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతుండటంతో త్వరలోనే పరిష్కారాలు కూడా దొరికే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్
కర్నూలులో ఘరానా మోసం… తల్లికి వందనం సొమ్ము స్వాహా!
ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!
Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’
హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్ఎక్స్.. స్టార్‌షిప్