రిలీజ్‌కు ఇంకా ఏడాది టైమ్ ఉన్నా.. ఏదో ఒక వార్తతో వారణాసి సినిమాను వార్తల్లో ఉంచేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. టైటిల్ ఎనౌన్స్మెంట్నే గ్లోబల్ రేంజ్లో చేసిన యూనిట్, అసలు ప్రమోషన్‌ను అంతకు మించి ప్లాన్ చేస్తోంది. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో పబ్లిసిటీ మీద ఫోకస్ చేస్తోంది. ఈ ప్లానింగ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు సంగీత దర్శకుడు కీరవాణి.. అవేంటో మన కూడా చూద్దాం పదండి. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న వారణాసి కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి క్రేజీ కాస్టింగ్.. మరోవైపు ట్రిపులార్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో షూటింగ్ దాదాపు కంప్లీట్ కావొస్తోందని చెప్పిన కీరవాణి.. మ్యూజిక్ విషయంలో తన ప్లానింగ్‌ను రివీల్ చేశారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా వారణాసి బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఛార్జ్ తీసుకోబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. జనవరి వరకు అంటే పూర్తిగా ఐదు నెలలు ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కే కేటాయించినట్టుగా రివీల్ చేశారు. ఒక ఇండియన్ సినిమాకు కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసమే ఇంత లాంగ్ షెడ్యూల్ ఇదే ఫస్ట్ టైమ్ అన్న టాక్ వినిపిస్తోంది. ట్రిపులార్‌కు ఆస్కార్ తెచ్చి పెట్టిన కీరవాణి టీమ్.. ఇప్పుడు అంతకు మించి బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతోంది. అడ్వెంచర్ సినిమా కోసం రాజమౌళి పూర్తిగా ఒక కొత్త సౌండ్ క్రియేట్ చేయమన్నారట. జక్కన్న విజువల్స్‌తో పాటు మహేష్ ఇమేజ్, ప్రియాంక గ్రేస్, పృథ్వీరాజ్ ప్రెజెన్స్‌ను మ్యాచ్ చేసే రేంజ్ మ్యూజిక్ ఇవ్వటం కోసం స్పెషల్ ఎఫర్ట్ పెడుతున్నామన్నారు కీరవాణి. కీరవాణితో పాటు రాజమౌళి కూడా పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. ఆల్రెడీ ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేయటంతో ఆన్ టైమ్ సినిమాను ఫినిష్ చేసేందుకు కష్టపడుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి కనీసం రెండు నెలల పాటు ప్రమోషన్స్ చేసేలా ఇప్పటి నుంచే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మరి జక్కన్న స్ట్రాటజీ ఎంతలా వర్కవుట్ అవుతుందో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!