Headlines

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!


దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన ఉద్గార నిబంధనలను కఠినతరం చేసింది. అంతేకాదు, వాహనదారులకు మేలు చేకూర్చేలా పలు మార్పులు చేస్తోంది. అందులో భాగంగా బీఎస్6 సాంకేతికత కలిగిన వాహన యజమానులకు పీయూసీ సర్టిఫికేట్ల విషయంలో భారీ ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతోంది. BS6 వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్ చెల్లుబాటు కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం కొత్తగా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఆరు సంవత్సరాల లోపు పాతవైన BS6 వాహనాలకు ఒకసారి పీయూసీ తీసుకుంటే అది మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనివల్ల ప్రతి ఏటా పీయూసీ కేంద్రాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. ఆ తర్వాత వాహనం వయస్సు 6 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు మాత్రం ఏడాదికి ఒకసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అయితే 10 సంవత్సరాలు దాటిన BS6 వాహనాలకు ఇంజిన్ పనితీరు, ఉద్గారాల తీవ్రత ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి పీయూసీ తప్పనిసరి చేశారు. మరోవైపు పాత తరహా వాహనాలైన BS4 మోడళ్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి, ఇంకా పాతవైన BS1, BS2, BS3 వాహనాలకు ప్రతి మూడు నెలలకొకసారి పీయూసీ తనిఖీలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. BS6 వాహనాల్లో ఆధునిక క్యాటలిటిక్ కన్వర్టర్లు, డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్లు వంటి అత్యుత్తమ పరిజ్ఞానం ఉండటం వల్ల ఇవి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే లక్షలాది మంది BS6 వాహనదారులకు సమయం, డబ్బు ఆదా కావడమే కాకుండా, ప్రభుత్వం ఎక్కువ కాలుష్యం వెదజల్లే పాత వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి వీలవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!

ఏసీ కోచ్‌లో నూనె దీపంతో పూజలు.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *