మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ అయింది అందాల ముద్దుగుమ్మ కేథరిన్ థ్రెసా. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు.. పూరీజగనాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి ఆకట్టుకుంది.
తొలి సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది కేథరిన్ థ్రెసా. సినిమా డిజాస్టర్ అయినా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఈ చిన్నది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన హిట్స్ పడలేదు. అదే క్రమంలో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ వచ్చింది. మెయిన్ హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గానూ సినిమాలు చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే రానా నేనే రాజు నేనే మంత్రి సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా కీలక పాత్రలో మెరిసింది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఇలా చాలా వరకు సెకండ్ హీరోయిన్ గానే మెప్పించింది కేథరిన్ థ్రెసా.
వీటితోపాటే .. చిరంజీవి రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన నటించింది. ఈ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. మెయిన్ హీరోయిన్ గానే కాదు, సెకండ్ హీరోయిన్ గానూ నటించి ఆకట్టుకుంది ఈ అందాల భామ. వరుసగా హిట్స్ అందుకుంటుంది కానీ మెయిన్ హీరోయిన్ గా అనుకున్నంతగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోతుంది ఈ బ్యూటీ.
ఇక ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో చిరంజీవి అసిస్టెంట్ గా కనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయినా కూడా కేథరిన్ థ్రెసాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ తన అందాలతో అదరగొడుతుంది. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.




