వానలు రోజు రోజుకు విపరీతంగా పడుతున్నాయి. ఇక ఈ టైమ్ లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ పాయసం రెసిపీ బెస్ట్ ఇది మీరు ఫుడ్ లో తింటే కొండను పిండి చేసే శక్తి వస్తుంది. అంతకముందు కాలంలో పెద్దలు ఇదే తిన్నారు. ఈ తీపి వంటకం తింటే ఉదయం, సాయంత్రం గిన్నెడు తింటే 100 ఏళ్ళు బలంతో పటు రోజంతా ఇది శక్తిని ఇస్తుంది
పాత కాలపు పూల్ మఖానా పాయసానికి కావలసిన పదార్థాలు: అర లీటర్ పాలు, మూడు కప్పులు పూల్ మఖానా , ఒక కప్పు బెల్లం ముక్కలు, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 5 బాదంపప్పులు , 5 పిస్తా పప్పులు, 5 జీడిపప్పు , 7 కిస్మిస్, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా కొంచం కుంకుమపువ్వు , ఒక టీ స్పూన్ కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి.
పాత కాలపు పూల్ మఖానా పాయసం తయారి విధానం: ముందుగా ఒక పాన్ కళాయి పెట్టి దానిలో నెయ్యి వేసి ఆ తరవాత పూల్ మఖానాను తీసుకుని 5 నిమిషాలు వేయించాలి ఆ తర్వాత వీటిని చల్లారనివ్వాలి. వాటిలో సగం మఖానాను గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్ర తీసుకుని దానిలో పాలు పోసి మరిగించాలి.
పాత కాలపు పూల్ మఖానా పాయసం తయారి విధానం స్టెప్ 1 : ఈ పాలు మరిగిన తర్వాత వేయించిన మఖానా, ఆ తరవాత పొడి చేసిన మఖానాను వేసి పాలలో బాగా ఉడికించాలి ఇవి బాగా మెత్తబడే వరకు వీటిని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరవాత బెల్లం కలపాలి. ఇంకా దీనిలో బాదం, పిస్తా, కిస్మిస్ను కూడా వేయించి ఈ పాయసంలో కలపాలి.
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




