Headlines

Varun Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా ప్రిన్స్.. అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. ఏం చేశాడో తెలుసా?

Varun Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా ప్రిన్స్.. అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. ఏం చేశాడో తెలుసా?


అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ పాటిల్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు వెంటనే స్పందించారు. తన తల్లిగారు పద్మజ సహకారంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి సురేష్ పాటిల్‌కు అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చికిత్స సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమకూర్చారు.అంతేకాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి వైద్య ఖర్చును స్వయంగా ఆయనే భరించి సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అండగా నిలిచారు.

అభిమానులకు అండగా ఉండటంలో వరుణ్ తేజ్ గారికి ఇది కొత్త విషయం కాదు. ఇటీవల అనంతపురానికి చెందిన ఓ అభిమాని మరణించిన సందర్భంగా కూడా, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వరుణ్ తేజ్ గారు, అవసరమైన సమయంలో ముందుండి సహాయం చేస్తూ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. పెదనాన్న చిరంజీవి నుంచి అందుకున్న మానవత్వం, సేవా దృక్పథాన్ని ఆచరణలో చూపిస్తూ అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు మెగా ప్రిన్స్.

ఇవి కూడా చదవండి



ఇక సినిమాల విషయానికి వస్తే.. త్వరలోన ‘కొరియన్ కనకరాజు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాలో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయన్ గా నటిస్తోంది. కమెడియన్ సత్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కటసాని కెమెరామెన్‌గా, సత్య జి. ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

అభిమాని కుటుంబ సభ్యులతో వరుణ్ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *