Headlines

IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్.. ఈ కార్డుల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే భారీ తగ్గింపులు..

IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్.. ఈ కార్డుల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే భారీ తగ్గింపులు..


భారత్‌లో రైళ్లల్లో తరచుగా లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్ బుక్ చేసుకుని సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక పలు ఆన్‌లైన్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ రైల్వే టికెట్ల బుకింగ్‌పై ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బుకింగ్స్‌పై కూడా డిస్కౌంట్లు పొందే అవకాశముంది. ఐఆర్‌సిటిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) పలు ప్రముఖ బ్యాంకుల సహకారంతో తీసుకొచ్చింది. ఈ కార్డుల ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా మీరు రివార్డ్ పాయింట్లను సంపాదించవచ్చు. ఆ పాయింట్లను తర్వాత రైలు టిక్కెట్లు లేదా ఇతర ప్రయాణ సంబంధిత సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం SBI కార్డ్, HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, RBL బ్యాంకులు IRCTC భాగస్వామ్యంతో ఈ కార్డులను అందిస్తున్నాయి.

-IRCTC RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ సమయంలో మంచి డిస్కౌంట్స్ పొందవచ్చు. IRCTC వెబ్‌సైట్ లేదా రైల్ కనెక్ట్ యాప్ ద్వారా తరచుగా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఈ కార్డ్ అనుకూలమైనదిగా చెప్పవచ్చు. ఈ కార్డుకు రూ. 500 అదనపు రుసుము, రూ. 500 వార్షిక రుసుము ఉంటుంది. మొదటిసారి కార్డ్ తీసుకునే వారికి 500 రివార్డ్ పాయింట్లు అందిస్తారు. IRCTC వెబ్‌సైట్ లేదా రైల్ కనెక్ట్ యాప్‌లో ఖర్చు చేసే ప్రతి రూ. 200కి 5 రివార్డ్ పాయింట్లు అందుతాయి. UTS యాప్ చెల్లింపులు, IRCTC ఫ్లైట్, హోటల్, క్రూయిజ్ బుకింగ్‌లపై కూడా రివార్డులు పొందవచ్చు. ఈ కార్డ్ రైలు టిక్కెట్ల బుకింగ్‌లపై 1 శాతం లావాదేవీ రుసుము మినహాయింపును కూడా అందిస్తుంది. సంవత్సరంలో 8 సార్లు IRCTC ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లను ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం ఉంది.

-ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ కూడా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కార్డు పొందేందుకు రూ. 500 తొలుత చెల్లించాలి. అలాగే రెన్యూవల్ ఫీజు రూ. 300 ఉంటుంది. కార్డు పొందిన తర్వాత 350 బోనస్ రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఐఆర్‌సిటిసి టిక్కెట్ బుకింగ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ. 100కి 10 రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. ఈ కార్డు ద్వారా ప్రతి సంవత్సరం 4 ఉచిత రైల్వే లాంజ్ సౌకర్యం పొందవచ్చు.

-ఇక ఐఆర్‌సిటిసి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ కూడా అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ కార్డుకు రూ.500 నమోదు ఫీజుతో పాటు రెన్యూవల్ ఫీజు రూ. 350 ఉంటుంది. కొత్త వినియోగదారులకు 500 బోనస్ రివార్డ్ పాయింట్లు అందుతాయి. ఐఆర్‌సీటీసీ టిక్కెట్ బుకింగ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ. 100కి గరిష్టంగా 40 బాబ్‌కార్డ్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. సంవత్సరానికి 4 సార్లు ఉచిత రైల్వే లాంజ్ సదుపాయం పొందవచ్చు.

-IRCTC HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రైన్లలో ఎక్కువగా ప్రయాణించేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్డ్ కోసం రూ. 500 ఆన్‌బోర్డింగ్ ఫీజు ఉంటుంది. కొత్త కార్డ్ హోల్డర్లకు రూ. 500 విలువైన వెల్‌కమ్ గిఫ్ట్ వోచర్ అందిస్తారు. IRCTC టిక్కెట్ బుకింగ్‌లపై చేసే ప్రతి రూ. 100 ఖర్చుకు 5 రివార్డ్ పాయింట్లు లభిస్తాయతి. సంవత్సరానికి 8 IRCTC ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు ఉచితంగా పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *