PF Money Withdrawal: ఉద్యోగులకు పీఎఫ్ డబ్బులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. అత్యవసర సమయాల్లో, ఏదైనా అనారోగ్యం, పెళ్లి, ఇల్లు కట్టుకోవడం, లేదా కొనడం వంటివి చేసినప్పుడు పీఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది పీఎఫ్ డబ్బులను ఎప్పటికప్పుడు విత్ డ్రా చేస్తుంటారు. కానీ ఎక్కువ సమయాల్లో విత్‌డ్రా చేసుకుంటున్నట్లయితే మీరు భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఏదైనా అత్యవసర సమయానికి మాత్రమే విత్‌డ్రా చేయాలి తప్ప ఇష్టానుసారంగా విత్‌డ్రా చేసుకున్నట్లయితే మీరే నష్టపోవాల్సి వస్తుంది. మీరు సొంతింటి కల నెరవేర్చుకోవడానికి మీ పీఎఫ్ (EPF) ఖాతా నుండి రూ. 50 లక్షలు విత్‌డ్రా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎందుకో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: August 1 New Rules: ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే.. మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం!
ప్రస్తుతం EPFపై 8.25% వడ్డీ లభిస్తోంది. ఇప్పుడు మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి రూ. 50 లక్షలు తీసుకుంటే, తదుపరి 20 ఏళ్లలో మీ పదవీ విరమణ సమయానికి మీరు ఏకంగా రూ. 2.44 కోట్లు కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రభావం వల్ల అంతటి పెద్ద మొత్తాన్ని మీరు నష్టపోతారని గుర్తించుకోండి.
ఇవి కూడా చదవండి
EPF విత్‌డ్రా vs హోమ్ లోన్ ఇందులో ఏది బెటర్
ఒకవేళ మీరు EPF నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకోకుండా, దానికి ప్రత్యామ్నాయంగా బ్యాంకు నుండి 8% వడ్డీకి 20 ఏళ్ల కాలపరిమితితో రూ. 50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. అప్పుడు మీరు బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 50.37 లక్షలు మాత్రమే. కానీ అదే ఈపీఎఫ్ నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకున్నట్లయితే భవిష్యత్తులో కోల్పోయే మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.2.44 కోట్లు. అంటే, హోమ్ లోన్ వడ్డీ రూపంలో మీరు చెల్లించే మొత్తం కంటే.. EPF నుండి డబ్బులు ఉపసంహరించుకోవడం ద్వారా భవిష్యత్తులో నష్టపోయే నిధి ఐదు రెట్లు ఎక్కువ.
ఎవరికి ఏది ప్రయోజనకరం?
రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నట్లయితే ఇల్లు కొనడానికి EPF నుండి డబ్బు ఉపసంహరించుకోవడం సమంజసమే కావచ్చు. కానీ కెరీర్ ప్రారంభంలో అంటే 30ల్లో ఉన్నవారు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో ఉన్నవారు లేదా మీ రిటైర్మెంట్ పొదుపు ప్రధానంగా EPF పైనే ఆధారపడి ఉంటే, మీ పీఎఫ్ డబ్బుల జోలికి పోకుండా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. అది చక్రవడ్డీ రూపంలో పెరిగేందుకు సమయం ఇవ్వాలి.
పన్ను ప్రయోజనాలు, వడ్డీ రేట్లు:
ప్రస్తుతం EPF ద్వారా లభించే 8.25% రాబడి అనేది పూర్తి పన్ను మినహాయింపు (Tax-free) ఉంటుంది.ఇది ప్రస్తుత హోమ్ లోన్ వడ్డీ రేటు (సుమారు 8%) కంటే ఎక్కువ.
EPF నుండి ఎప్పుడు విత్‌డ్రా చేయాలి?
డౌన్ పేమెంట్ కొరత ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకోవడం ముఖ్యం. ఇల్లు కొనే సమయంలో భారీగా డౌన్ పేమెంట్ చెల్లించాల్సి వచ్చినప్పుడు పాక్షిక విత్‌డ్రా ఉపయోగపడుతుంది. అలాగే మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల బ్యాంకు నుంచి రుణం లభించనట్లయితే వారు అత్యవసర డబ్బుల కోసం EPF బాలెన్స్ ఉపయోగించుకోవచ్చు. నూతన నిబంధనలు ఈపీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి సులభమైన సదుపాయాన్ని కల్పిస్తున్నప్పటికీ, ఈపీఎఫ్ నిధిని ప్రాథమికంగా మీ పదవీ విరమణ ఆస్తిగా మాత్రమే పరిగణించండి. అత్యవసర పరిస్థితి లేదా ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప, ఈ నిధులను ముందస్తుగా వాడకపోవడమే మీ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ.
ఇది కూడా చదవండి: Post Office: లక్షకు రెండు లక్షలు.. పోస్ట్ ఆఫీస్‌లో డబుల్ ధమాకా.. రెట్టిపు ఆదాయం..!
ఇది కూడా చదవండి: Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు.. RBI హాలిడే లిస్ట్ ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి