Headlines

ముగిసిన జింబాబ్వే సిరీస్.. వైభవ్ సూర్యవంశీ మళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడో తెలుసా?

ముగిసిన జింబాబ్వే సిరీస్.. వైభవ్ సూర్యవంశీ మళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడో తెలుసా?


Vaibhav Sooryavanshi Next Match: జింబాబ్వే గడ్డపై పరుగుల తుఫాను సృష్టించి భారత అభిమానులను మైమరపించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ మెరుపుల నుంచి టీమిండియా జెర్సీ వరకు తన విధ్వంసకర ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ యంగ్ సెన్సేషన్, మళ్లీ ఎప్పుడు బ్యాట్ పట్టి మైదానంలో దిగుతాడా అని దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జింబాబ్వే సిరీస్‌లో సూర్యవంశీ ఊచకోత..

ఇంగ్లాండ్ పర్యటనలో కాస్త తడబడినా, ఆ తర్వాత జింబాబ్వే టూర్‌లో వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయిన తీరు అద్భుతం. తొలి మ్యాచ్‌లోనే కేవలం 18 బంతుల్లోనే ధనాధన్ హాఫ్ సెంచరీ బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ఇక చివరి పోరులో 49 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 196.10 స్ట్రైక్ రేట్‌తో, 50.33 సగటుతో మొత్తం 151 పరుగులు సాధించి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాడు.

తర్వాత మ్యాచ్ ఎప్పుడు? ఏ టోర్నీలో ఆడనున్నాడు?

జింబాబ్వేతో టీ20 సిరీస్ విజయవంతంగా ముగియడంతో, అందరి దృష్టి వైభవ్ తదుపరి మ్యాచ్‌పైనే నెలకొంది. వైభవ్ సూర్యవంశీ వచ్చే సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ‘ఆసియా క్రీడలు 2026’ (Asian Games 2026)లో భారత జట్టు తరఫున ఆడనున్నాడు. మేనేజ్‌మెంట్ ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం అతడిని ఎంపిక చేసింది. జపాన్‌లోని ఐచి ప్రావిన్స్‌లోని కోరోగీ అథ్లెటిక్ పార్క్‌లో ఈ పోటీలు ముగియనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ అధికారిక తేదీలు ఇంకా వెల్లడికాకపోయినా, సెప్టెంబర్ చివరి వారంలో ఈ యంగ్ స్టార్ మళ్లీ మైదానంలో మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు.

భారత జట్టులో శాశ్వత స్థానం ఖాయమేనా?

టీ20 ఫార్మాట్‌లో మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేసే వైభవ్ నైపుణ్యం, అతడిని భవిష్యత్తులో భారత జట్టులో కీలక ఆటగాడిగా మార్చేలా ఉంది. అభిషేక్ శర్మ లాంటి పవర్ హిట్టర్ల బాటలోనే పయనిస్తూ, ఓపెనర్‌గా జట్టుకు అద్భుతమైన ఆరంభాలు అందిస్తున్నాడు. వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి సీనియర్లు ఉన్నందున వైభవ్ ప్రస్తుతం టీ20 స్పెషలిస్ట్‌గానే కొనసాగే అవకాశం ఉంది. బిసిసిఐ కూడా ఈ యువ సంచలనాన్ని నిరంతరం జట్టు ప్రణాళికల్లో ఉంచుతూ సరిగ్గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *