బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆదిత్య సక్సేనా అనే నెటిజన్ షేర్ చేసిన గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో కేవలం 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏకంగా 47 నిమిషాల సమయం పడుతుందని చూపిస్తోంది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఈ ట్రాఫిక్ నరకంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, మీమ్స్‌తో స్పందిస్తున్నారు. బెంగళూరులో ఐటీ వృద్ధికి సమానంగా మౌలిక వసతులు పెరగకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని మండిపడుతున్నారు. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం..
ఆదిత్య సక్సేనా అనే నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ ఆధారంగా ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అందులో ఆయన ప్రయాణించాల్సిన దూరం కేవలం 4 కిలోమీటర్లు. కానీ, దానికి పడుతున్న సమయం మాత్రం 47 నిమిషాలు! ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయిన ఆయన, 4 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి 47 నిమిషాలు పడుతోంది. అంటే నేను వాహనం కంటే నడిచి వెళ్లడమే చాలా వేగంగా చేరుకునేలా ఉన్నాను! అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. బెంగళూరు వాసులు, ఇతర నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందించారు. బెంగళూరులో కారు కంటే కాళ్లను నమ్ముకోవడమే ఉత్తమం అని కొందరు కామెంట్ చేయగా, బెంగళూరులో దూరాలను కిలోమీటర్లలో కాకుండా సమయం లెక్కించాలి అంటూ మరికొందరు విమర్శించారు. ఈ ట్రాఫిక్‌లో కూర్చుని ఒక సినిమా మొత్తం లేదంటే, ఓవర్ చూసేయొచ్చు అని మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు.
వీడియో ఇక్కడ చూడండి..
అసలు విషయం ఏంటంటే.. బెంగళూరు నగరంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, కొనసాగుతున్న మెట్రో నిర్మణ పనులు, ఇరుకైన రోడ్లు, వర్షాల సమయంలో నీరు నిలవడం వంటి కారణాల వల్ల ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఎంత సమయం ముందు బయలుదేరినా అనుకున్న సమయానికి చేరుకోవడం గగనంగా మారుతోంది. బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నప్పటికీ, ఇక్కడి ట్రాఫిక్ సమస్యలు మాత్రం నగరవాసుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మౌలిక వసతులను వేగవంతంగా మెరుగుపరిస్తే తప్ప ఈ ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం లభించదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..