Headlines

IND vs ZIM 2nd T20I: తొలిసారి టాస్ ఓడిన శ్రేయాస్.. ప్లేయింగ్ 11 ఇదే.. బుడ్డోడి సెంచరీ లోడింగ్?

IND vs ZIM 2nd T20I: తొలిసారి టాస్ ఓడిన శ్రేయాస్.. ప్లేయింగ్ 11 ఇదే.. బుడ్డోడి సెంచరీ లోడింగ్?


Zimbabwe vs India, 2nd T20I: భారత్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ నేడు హరారేలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాలని చూస్తోంది.

జింబాబ్వేపై వరుసగా మూడో టీ20ఐ సిరీస్‌ను గెలుచుకునే అవకాశం భారత్‌కు లభించింది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అర్ధశతకం సాధించగా, టీమ్ ఇండియా ఏడు వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది.

3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన జింబాబ్వే..

భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో భారత్ 12 మ్యాచ్‌లు గెలవగా, జింబాబ్వే మూడు మ్యాచ్‌లు గెలిచింది.

పిచ్ నివేదిక, వాతావరణం..

హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలిస్తుంది. అయితే, తొలి ఓవర్లలో కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు కొంత స్వింగ్, సీమ్ అందించవచ్చు. అందువల్ల, నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.

శనివారం హరారేలో వాతావరణం స్పష్టంగా ఉంటుందని, వర్షం పడే అవకాశం లేదని అంచనా. ఉష్ణోగ్రతలు 7 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *