Headlines

TV9 Sweet Home Expo 2026: ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌.. అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో ప్రారంభం

TV9 Sweet Home Expo 2026: ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌.. అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో ప్రారంభం


హైదరాబాద్‌లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో.. TV9 Sweet Home Expo 2026 ప్రారంభమైంది.. శనివారం, ఆదివారం హైటెక్స్‌లో టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో జరగనుంది. ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు.. పలువురు ప్రతినిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలో.. 80కి పైగా రియల్ ఎస్టేట్ కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో నిర్వహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

Tv9 Sweet Home Expo 2026

Tv9 Sweet Home Expo 2026

TV9 Sweet Home Expo 2026 హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఇవాళ, రేపు జరుగుతుంది. ఈ ఎక్స్‌పో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఎక్స్‌పోకి ప్రవేశం అందరికీ ఉచితం.. రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్‌ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఎక్స్‌పో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి. స్ధిరాస్తుల కొనుగోలు, అమ్మకాలపై సలహాలు, సందేహాలకు సరైన వేదిక ఈ స్వీట్‌ హోం ఎక్స్‌పో.. ఇక్కడ రియల్ ఎస్టెట్ కు సంబంధించిన అనేక విషయాలపై మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు..

లైవ్ వీడియో చూడండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *