Headlines

Vegetable Prices: సామాన్యులకు కాస్త ఊరట.. స్థిరంగా కూరగాయల ధరలు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Vegetable Prices: సామాన్యులకు కాస్త ఊరట.. స్థిరంగా కూరగాయల ధరలు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?


కూరగాయలు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా.. ఇప్పుడు సాధారణ స్థాయిలో ఉన్నాయి. కూరగాయలు ధరలు అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, రైతుల పంట దిగుబడిని బట్టి మార్పులు ఉంటాయి. ఇక డిమాండ్ కూడా ధరలను ప్రభావితం చేస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ధరలు పెరుగుతాయి. అదే తక్కువగా ఉంటే ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు ధరలు సాధారణంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

హైదరాబాద్‌లో రేట్లు ఇలా..

హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు బజార్‌లో కిలో టమాటా రూ.18, వంకాయ రూ.23, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.35, బజ్జి మిర్చి రూ.50, కాకరకాయ రూ.35, బీరకాయ రూ.28, క్యాబేజీ రూ.21, బీన్స్ రూ.55, క్యారెట్ రూ.41, గోబీ రూ.25, దొండకాయ రూ.28, చిక్కుడుకాయ రూ.55, గోరుచిక్కుడు రూ.28, బీట్‌రూట్ రూ.28, క్యాప్సికం రూ.50, ఆలుగడ్డ రూ.18, కీరా (లోకల్) రూ.13, కీరా (ఇటాలియన్) రూ.23, దోసకాయ రూ.15, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.23, కంద రూ.45, ఉల్లికాడలు రూ.55, ఉల్లిగడ్డ రూ.30, మామిడికాయ రూ.15–20, అరటికాయ రూ.10–11, చామగడ్డ రూ.28, ముల్లంగి (ఒక్కటి) రూ.6–8, చిలగడదుంప రూ.40, గుమ్మడికాయ రూ.40, నిమ్మకాయలు (డజన్) రూ.26–32 పలుకుతున్నాయి. ఇక మునగకాయలు (ఒక్కటి) రూ.8–10, బొప్పాయి రూ.40, పుట్టగొడుగులు (200 గ్రాములు) రూ.45, ఎండుమిర్చి రూ.260, పాత అల్లం రూ.200, వెల్లుల్లి రూ.260, చింతపండు రూ.160, పండుమిర్చి రూ.80, ఉసిరి రూ.85, కరివేపాకు రూ.50, పర్వల్ రూ.40, పల్లీలు రూ.75, లోభా రూ.40, టీజెల్ కాకరకాయ రూ.180కు లభిస్తున్నాయి.

గుంటూరులో ఎలా ఉన్నాయంటే..?

గుంటూరులో రైతు బజార్లలో కిలో టమాటా రూ.18, బెండ రూ.22, పచ్చిమిర్చి రూ.49, కాకరకాయ రూ.37, బీరకాయ రూ.40, క్యాలిఫ్లవర్ రూ.38, క్యాబేజీ రూ.32, క్యారెట్ రూ.60, దొండకాయ రూ.33, బంగాళదుంప రూ.23, ఉల్లిపాయలు రూ.34, గోరుచిక్కుళ్లు రూ.30, దోసకాయ రూ.20, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.25, అరటికాయ రూ.10, చామదుంప రూ.29, మునగ రూ.10, బీట్ రూట్ రూ.43, కీరదోసకాయ రూ.59, బీన్స్ రూ.75, క్యాప్సికమ్ రూ.75, కొత్తిమీర రూ.30, ఆకుకూరలు రూ.15, నిమ్మకాలు రూ.40, అల్లం రూ.195, వెల్లుల్లి రూ.190 పలుకుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *