Headlines

Viral News: బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం.. డ్రైవర్ కోసం..

Viral News: బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం.. డ్రైవర్ కోసం..


చిన్నప్పటి నుంచి కనిపెంచిన తల్లిదండ్రులనే పట్టించుకోని మనుషులు ఉన్న ఈ రోజుల్లో.. తన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఓ కంపెనీ యజమానికి స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్‌ అవుతోంది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని కేవలం ఒక పనివాడిగా కాకుండా, తనతో సమానమైన సహోద్యోగిగా గౌరవిస్తూ.. అతడి హార్ట్ సర్జరీ కోసం రూ. 4.25 సహాయం చేసిన ఆ యజమాని వ్యక్తిత్వానికి నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు. బాస్ అంటే ఇలా ఉండాలని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ మిశ్రా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఘటన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. డాక్టర్ మిశ్రా ప్రకారం..ఈ మధ్య కాలంలో డాక్టర్ మిశ్రా దగ్గరకు శుక్లా అనే ఓ వ్యక్తి బైపాస్ సర్జరీ కోసం వచ్చాడు. అయితే ఆపరేషన్‌కు సుమారు రూ.4.25లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పగా.. తాను కేవలం డ్రైవర్‌నేనని.. అంత డబ్బు సర్దడం తన వల్ల కాదని.. దయచేసి ఖర్చు విషయంలో కొద్దిగా సాయం చేయండి శుక్లా డాక్టర్‌ను కోరారు. అయితే డాక్టర్ కూడా తనకు వీలైనంత సహాయం చేస్తానని శుక్లాకు హామీ ఇచ్చారు.

కానీ నెస్ట్ డే మార్నింగ్ అయ్యే సరికి అందరినీ ఆశ్చర్యపరిచే పరిణామం జరిగింది. శుక్లా డ్రైవర్‌గా పనిచేస్తున్న కంపెనీ యజమానికి శుక్లా ఆపరేషన్‌కు కావాల్సిన
రూ. 4.25 లక్షల పూర్తి మొత్తాన్ని నేరుగా హాస్పిటల్‌ అకౌంట్‌కు RTGS ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. డబ్బులు అందడంతో డాక్టర్‌లు కూడా అతనికి వెంటనే ఆపరేషన్ చేశారు. అయితే సర్జరీ పూర్తైన తర్వాత.. డాక్టర్ మిశ్రా.. సదురు కంపెనీ యజమానికి ఫోన్ చేసి మాట్లాడారు. సర్జరీ సక్సెస్ అయిందని చెప్పారు. అది విన్న యజమానికి తన సహ ఉద్యోగిని కాపాడినందుకు ధన్యవాదాలు అని డాక్టర్‌కు తెలిపాడు.

అయితే శుక్లా తన సహా ఉద్యోగి అని యజమానికి చెప్పిన మాటలు విన్న డాక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.. శుక్లా తాను మీ వద్ద డ్రైవర్ పనిచేస్తున్నానని.. మీరు తన బాస్ అని చెప్పాడు.. మరి మీరేమో సహా ఉద్యోగి అంటున్నారని సదురు యజమానికి డాక్టర్ ప్రశ్నించాడు.అప్పుడు యజమానికి చెప్పిన సమాధానం యావత్ మానవాలి హృదయాన్ని కదిలించింది.

డ్రైవర్ కాదు.. నా కొలీగ్

డాక్టర్ అడిగిన ప్రశ్నకు సదురు యజమానికి సమాధానం ఇస్తూ.. డాక్టర్ గారు, మేమిద్దరం కలిసి పనిచేస్తాం. అతడు గత 15 ఏళ్లుగా నాతో ఉంటున్నాడు. నేను అతడిని కేవలం డ్రైవర్‌గా మాత్రమే చూడటం లేదు. మేం ఇద్దరం కలిసి పనిచేస్తాం.. మా ఇద్దరి దైనందిన జీవితంలో పాత్రలు వేరు కావచ్చు, కానీ మేమిద్దరం కలిసి పనిచేస్తున్నామన్నారు.. అతడి పని వేరు కావచ్చు, కానీ మేమిద్దరం కొలీగ్స్‌మే! అని ఆ యజమాని ఎంతో వినయంగా చెప్పారు. అది విన్న డాక్టర్ సైతం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *