Headlines

Central Government: ఆధార్ నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ వరకు.. ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ సేవలు..

Central Government: ఆధార్ నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ వరకు.. ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ సేవలు..


కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే మొబైల్ ద్వారా అన్నీ సేవలు పొందేలా యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ పత్రాలు పొందేందుకు, ప్రభుత్వ పత్రాలు భద్రపర్చుకునేందుకు, ఆధార్, ఆరోగ్య, ట్రాన్స్‌పోర్ట్ సేవలతో పాటు అనేక సర్వీసులు సులువుగా పొందేలా యాప్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్స్ ప్రతీఒక్కరి ఫోన్‌లో ఉంటే అనేక పనులు సులభంగా పూర్తవుతాయి. ఆ యాప్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఉమాంగ్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక సేవలు పొందవచ్చు. పాన్ కార్డు అప్లై చేసుకోవడం, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం, పెన్షన్ సేవలు, పీఎఫ్ సేవలు, రేషన్.. ఇలా అనేక సేవలు లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్‌గా దీనిని చెప్పవచ్చు. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. అనేక ప్రభుత్వ సేవలు ఈజీగా పొందవచ్చు.

డిజిలాకర్

ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు లాంటివి తరచుగా ఉపయోగపడుతుంటాయి. మీరు వీటిని వెంట తీసుకెళ్లడం మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో డిజిలాకర్ ద్వారా ఎక్కడినుంచైనా సులువుగా సర్టిఫికేట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మీరు సేవ్ చేసి పెట్టుకుంటే ఎక్కడైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.

ఆధార్ యాప్

కేంద్రం ఇటీవల కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉంటే ఆధార్ సేవలు డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఆధార్ ఫిజికల్ కాపీ అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ ధృవీకరణ, వివరాలు అప్డేట్ లాంటివి సులువగా చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీ మొబైల్‌లో ఉంటే మీరు జేబులో ఆధార్ ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు.

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్

ఎక్కువమంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ఈ యాప్ మీ మొబైల్‌లో ఉండటం వల్ల సులువుగా రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ బుకింగ్స్, సీట్ల అవైలబిలిటి, పీఎన్ఆర్ స్టేటస్ వంటివి సులువగా యాక్సెస్ చేయవచ్చు.

ఎం పరివాహన్

వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్నీ సేవలు ఇందులో పొందవచ్చు. బైక్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, వెహికల్ ఇన్యూరెన్స్ లాంటి అన్నీ డాక్యుమెంట్స్ ఒకేచోట స్టోర్ అవుతాయి. అలాగే మీ వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెక్ చేసుకోవచ్చు.

భీమ్ యాప్

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా భీమ్ యూపీఐ యాప్‌ను తీసుకొచ్చింది.ఈ యాప్ ద్వారా వేగంగా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇక మొబైల్, గ్యాస్, కరెంట్ బిల్లులు లాంటివి చెల్లించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *