Headlines

Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్

Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్


ప్రధానమంత్రి మోడీ మే10 హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోడీ. అలాగే పలు రాజకీయ సమావేశాలు, సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను కూడా కలిశారు. వీరితో పాటు ప్రముఖ నటుడు, దర్శక రచయిత తనికెళ్ల భరణి కూడా ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని తన తిరుగు ప్రయాణంలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు అక్కడే ఉన్న తనికెళ్ల భరణి మోడీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా భరణి మోడీకి నమస్కారం చేయగా ప్రధాని కూడా భరణి చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే మోడీతో కలిసి ఉన్న ఫొటోను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేశారు భరణి ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. చూడలేము కూడా… కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం” అంటూ పోస్ట్ చేశారు భరణి. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే రాకాస సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు తనికెళ్ల భరణి. ఇందులో హీరోయిన్ తండ్రి శాస్త్రి పాత్రలో ఆకట్టుకున్నారు. మానస శర్మ తెరకెక్కంచిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో, హీరోయిన్లుగా నటించారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించడం విశేషం. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడీ రాకాస సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లిపోతోంది. ప్రస్తుతం భరణి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??

Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!

CM Thalapathy Vijay: సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా ??

CM Vijay: అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు

RK Roja: నా చిన్నారి అన్షు.. ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగింది !! రోజా ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *