Headlines

OTT Movie: చేతబడి బెడిసికొడితే.. ఓటీటీని వణికిస్తోన్న హారర్ థ్రిల్లర్.. ఒక్కరోజులోనే టాప్ ట్రెండింగ్‌లోకి..

OTT Movie: చేతబడి బెడిసికొడితే.. ఓటీటీని వణికిస్తోన్న హారర్ థ్రిల్లర్.. ఒక్కరోజులోనే టాప్ ట్రెండింగ్‌లోకి..


OTT Movie: చేతబడి బెడిసికొడితే.. ఓటీటీని వణికిస్తోన్న హారర్ థ్రిల్లర్.. ఒక్కరోజులోనే టాప్ ట్రెండింగ్‌లోకి..

గత శుక్రవారం (మే 08) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అలా గత శుక్రవారమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ సినిమా ఓటీటీని వణికిస్తోంది. క్షుద్ర పూజలు, దుష్టశక్తులు, ఆధ్యాత్మిక భయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెట్టి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమానే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. స్టోరీ విషయానికి వస్తే.. క్షుద్రపూజలు, దుష్ట శక్తులు బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దుష్టశక్తులను నిద్ర లేపే క్షుద్రపూజలు, చేతబడులు విఫలమైతే ఎలాంటి పరిణామాలు సాగుతాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో ఈ హారర్ కథ సాగుతుంది.

ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అస్తినాపురం అనే గ్రామంలో చేసే క్షుద్రపూజలు బెడిసి కొట్టి ఓ దుష్టశక్తి బయటకు వస్తుంది. దీంతో తరాల పాటు ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తుంది. కట్ చేస్తే.. ప్రస్తుతం కాలంలో మార్సెలిన్ (మోనా బెడ్రే)ను, ఆమె కుటుంబాన్ని ఆ దుష్టశక్తి వెంటాడుతుంది. దీని వల్ల మార్సెలిన్ వింతగా వయలెన్స్‌గా ప్రవర్తిస్తుంటుంది. అలాగే ఆమె పిల్లల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. మరి ఆ శాపం, దుష్ట శక్తి నుంచి ఆమె తన బిడ్డలను ఎలా కాపాడుకుందన్నదే ఈ సినిమా స్టోరీ.

ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ ను భయపెడుతోన్న ఈ మూవీ పేరు ‘సతన్ : ది డార్క్’. సతన్ అంటే సైతాన్ అని అర్థం. మణికందన్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ లో ఐరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజ రవి కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం సతన్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ లో ‘సతన్ : ది డార్క్’

ప్రస్తుతం ఓటీటీల్లోని సినిమాలివే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *