తమిళ రాజకీయాల్లో కొత్తశకం మొదలైంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత తమిళనాడులో కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ నిర్మాణాన్ని సమర్థవంతంగా బద్దలుకొట్టి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీవీకే పార్టీ. ఏళ్ల నాటి చరిత్రను తిరగరాస్తూ పార్టీ అధినేత విజయ్ రాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ విజయ్ చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇక సీఎం తర్వాత 9 మంది టీవీకే ఎమ్మెల్యే రాష్ట్ర నతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అయితే విజయ్ కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న ఈ టీవీకే ఎమ్మెల్యేలంతా విజయ్ కొత్త కేబినెట్‌లో ఉండనున్నారు. వారిలో ఆధవ్ అర్జున, సెంగోట్టియాన్, బుస్సీ ఆనంద్, అరుణ్ రాజ్, S.కీర్తన, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజమోహన్, టీకే ప్రభు ఉన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తమిళనాడు మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి , సినీ తారలు హాజరయ్యారు.
అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చెన్నై వ్యాప్తంగా 20 కీలక ప్రదేశాలలో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు. మెరీనా బీచ్, బేసెంట్ నగర్ బీచ్, అన్నానగర్ టవర్ పార్క్, సెంట్రల్, CMBT, సెమ్మొళి పొంగ, కతిపార జంక్షన్‌లో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
విజయ్ ప్రమాణస్వీకారం లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి