Headlines

ఏసీ అసవరం లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చా? ఈ సింపుల్ చిట్కాలతో సాధ్యమే!

ఏసీ అసవరం లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చా? ఈ సింపుల్ చిట్కాలతో సాధ్యమే!


ఏసీ అసవరం లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చా? ఈ సింపుల్ చిట్కాలతో సాధ్యమే!

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ, చాలా మంది రోజంతా ఎయిర్ కండిషనర్‌పై ఆధారపడాల్సి వస్తోంది. అయితే పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, ప్రతి ఇంట్లో ఏసీ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సహజంగా ఇంటిని చల్లగా ఉంచే మార్గాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని చిన్న మార్పులతోనే ఇంట్లో ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో వచ్చే తీవ్రమైన సూర్యరశ్మిని అడ్డుకోవడం చాలా అవసరం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కిటికీలకు మందపాటి కర్టెన్లు లేదా బ్లైండ్స్ వేయడం వల్ల గదిలో వేడి తగ్గుతుంది. లేత రంగు కర్టెన్లు వేడిని పరావర్తనం చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాన్లను సరైన విధంగా ఉపయోగించుకోవడం ద్వారా కూడా చల్లదనాన్ని పెంచుకోవచ్చు. టేబుల్ ఫ్యాన్ ముందు ఐస్ లేదా చల్లటి నీటి గిన్నె ఉంచితే గాలి మరింత చల్లగా అనిపిస్తుంది. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వేడి గాలిని బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇంట్లో అవసరం లేకుండా పనిచేస్తున్న టీవీలు, ల్యాప్‌టాప్‌లు, పాత బల్బులు కూడా వేడిని విడుదల చేస్తుంటాయి. వీటిని ఉపయోగించని సమయంలో ఆఫ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా పాత బల్బుల బదులుగా ఎల్ఈడీ బల్బులు ఉపయోగిస్తే వేడి తక్కువగా ఉంటుంది.

క్రాస్ వెంటిలేషన్ కూడా ఇంటిని చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం ద్వారా తాజా గాలి ఇంట్లోకి ప్రవహిస్తుంది. పత్తి బెడ్‌షీట్లు, తేలికపాటి కాటన్ దుస్తులు వేసుకోవడం వల్ల కూడా శరీరానికి చల్లదనం కలుగుతుంది. అలాగే కలబంద, స్నేక్ ప్లాంట్ వంటి ఇంటి మొక్కలు గాలిలో తేమను పెంచి కొంత చల్లదనాన్ని అందిస్తాయి.

మధ్యాహ్నం లేదా సాయంత్రం చల్లటి నీటితో నేలను తుడవడం కూడా పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న సమర్థవంతమైన చిట్కాగా భావిస్తున్నారు. అదేవిధంగా పైకప్పుపై తెల్లటి పెయింట్ వేయడం లేదా టెర్రస్‌పై నీళ్లు చల్లడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తాగడం, దోసకాయ, పుచ్చకాయ వంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవడం వల్ల వేసవి వేడిని తట్టుకోవడం సులభమవుతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *