తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు టీవీకే అధినేత విజయ్. ఇక ఆయన అభిమానుల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. సోమవారం (మే 04) వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ విజయ దుందుభి మోగించింది. ఏకంగా 111 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ సినీ ప్రముఖులు విజయ్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన విజయ్ కు అభినందనలు తెలుపుతూనే ‘భూమికి ముదల్వర్(గౌరవనీయులైన ముఖ్యమంత్రి) అనే పేరుతో జననాయగన్ సినిమాను త్వరగా విడుదల చేయండి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని మిస్ అయిన సెలబ్రేషన్‌ను ఈ ఏడాదంతా జరుపుకుంటాం’ అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజయ్ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఎన్నికలకు ముందు విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ (తెలుగులో జన నాయకుడు). హెచ్.వినోద్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే మమితాబైజు, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా చేశాడు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ ససినిమా సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పుటికీ రిలీజ్ కాలేదు. అసలు ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి. దీనికి తోడు ఈ సినిమ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. అలాగే జననాయగన్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమాన వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ విజయం సాధించిన నేపథ్యంలో జననాయగన్ కు రిలీజ్ కు అడ్డంకులు తొలగినట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
Maanbumigu Thamizhaga Mudhalvar
Dr. C. Joseph Vijay
Nu title card pottu andha #Jananayagan ah release panni vidunga.. Pongalukku miss aana celebration ah indha varsham full ah pannidrom 🔥🔥🔥 #ThalapathyVijay
— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) May 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.