Teeth: గారపట్టిన పళ్లు ముత్యాల్లా మెరిసిపోవాలంటే.? ఈ సింపుల్ చిట్కాతో కేవలం 2 నిమిషాల్లోనే.!

Teeth: గారపట్టిన పళ్లు ముత్యాల్లా మెరిసిపోవాలంటే.? ఈ సింపుల్ చిట్కాతో కేవలం 2 నిమిషాల్లోనే.!


Teeth: గారపట్టిన పళ్లు ముత్యాల్లా మెరిసిపోవాలంటే.? ఈ సింపుల్ చిట్కాతో కేవలం 2 నిమిషాల్లోనే.!

ముఖం ఎంతో అందంగా ఉన్నప్పటికీ, పసుపు పచ్చటి దంతాలు ఉన్నవారికి నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. సిగరెట్లు, బీడీలు, తంబాకు, గుట్కాలు లాంటి వాటిని ఎక్కువగా వాడటం వలన దంతాలు త్వరగా దెబ్బతిని పసుపు పచ్చ రంగులోకి మారడమే కాకుండా, నోటి నుంచి దుర్వాసన రావడం, పళ్ళ మధ్య నల్లగా మారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ దంత సమస్యలతో బాధపడేవారికి వంటింటి చిట్కా చెప్పేస్తున్నాం. కేవలం రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలతో ఆరోగ్యవంతమైన, తళతళలాడే దంతాలను పొందొచ్చు.

ఈ చిట్కాను తయారుచేసుకోవడానికి అవసరమైన పదార్థాలు మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. ముందుగా, మనం రోజువారీగా ఉపయోగించే టూత్‌పేస్ట్‌ను తీసుకోండి. పేస్ట్ రంగుతో సంబంధం లేదు. బ్రష్ చేయడానికి ఎంత పేస్ట్ వాడతామో, సరిగ్గా అంతే మోతాదులో ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత, దానికి కొద్దిగా ఉప్పును కలపండి. ఉప్పు దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది, అలాగే చిగుళ్లను సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత, ఒక చిటికెడు పసుపును వేయండి. పసుపు కేవలం వంటలలోనే కాకుండా, సౌందర్య సాధనాలలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత నిమ్మకాయ. నిమ్మకాయలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. నోటి దుర్వాసనతో బాధపడేవారికి నిమ్మకాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పళ్ళపై పేరుకున్న గారను, పసుపు రంగును తొలగించడంలో సహాయపడుతుంది. పుచ్చిన దంతాలలో ఉండే పురుగులను కూడా చంపే సామర్థ్యం నిమ్మరసానికి ఉంది. కాబట్టి, కొద్దిగా నిమ్మరసాన్ని ఈ మిశ్రమంలో కలపండి.

ఇక ఫైనల్‌గా వెల్లుల్లి. మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెమ్మలను తీసుకొని, వాటిని వీలైనంత మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు దంతాలను తెల్లగా మార్చడానికి దోహదపడతాయి. అంతేకాకుండా, వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, దంతాల మధ్య చెడు బ్యాక్టీరియా చేరకుండా చూస్తాయి. చిగుళ్లలోని వాపును కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది. మెత్తగా దంచిన వెల్లుల్లిని మిగిలిన పదార్థాలతో కలిపి, మొత్తం మిశ్రమాన్ని బాగా కలపండి. ఈ అద్భుతమైన మిశ్రమాన్ని బ్రష్‌పై తీసుకొని, రోజువారీ బ్రష్ చేసుకున్నట్లుగా, ప్రతిరోజు ఉదయం రెండు నుంచి మూడు నిమిషాల పాటు బ్రష్ చేయండి. ఈ పేస్ట్‌తో బ్రష్ చేయడం వలన మీ దంత సమస్యలన్నీ దూరమై, దంతాలు ఆరోగ్యంగా, తళతళ మెరిసిపోతాయి. వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పేస్ట్‌ను వాడితే తప్పకుండా మంచి ఫలితాలను చూడగలరు. నిరంతరం ఈ చిట్కాను పాటించడం ద్వారా ఎటువంటి దంత సమస్యలు మీ దరిచేరవు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *