జ్యువెలరీ షాపు దోపిడీ కేసు.. దొంగల్లో ముగ్గురు బిహార్‌కు చెందినవారిగా గుర్తింపు

జ్యువెలరీ షాపు దోపిడీ కేసు.. దొంగల్లో ముగ్గురు బిహార్‌కు చెందినవారిగా గుర్తింపు


మొత్తం ఐదుగురు. ఫేస్‌కి మాస్క్‌ కూడా లేకుండా సింపుల్‌గా సినిమాకొచ్చినట్టు వచ్చి సుమారు కేజీ బంగారం దోచుకెళ్లారు. లోపలికి వెళ్లడంతోనే వెంట తెచ్చుకున్న గన్నులు బయటకు తీసి… 25 నిమిషాల పాటు కస్టమర్స్‌ని సిబ్బందిని బెంబేలెత్తించారు. అడ్డుకోబోయిన నలుగురు సిబ్బందిపైనా కాల్పులు జరిపి బ్యాగుల్లో బంగారం నింపుకుని ఉడాయించారు. ఇదంతా జరిగింది ఆదివారం ఉదయం 11 గంటల నుంచి పదకొండున్నర మధ్యలోనే. దీంతో కరీంనగర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలే ఈ స్థాయి దొపిడీ జరగడంపై ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… దర్యాప్తు ముమ్మరం చేశారు. 12 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న కరీంనగర్‌ పోలీసులు… ఐదుగురిలో ముగ్గురు బిహార్‌కి చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరు ఆనంద్, మరొకరు ఇంతియాజ్‌ అని తెలిపారు. కేవలం కరీంనగర్‌లోనే కాదు… అవుట్ ఆఫ్‌ ది స్టేట్‌లోనూ దొంగల కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు తెలిపారు. వీలైనంత త్వరగా పట్టుకుని బంగారాన్ని రికవరీ చేస్తామంటున్నారు.

దోపిడీ వ్యవహారం పొలిటికల్‌గానూ కాక రేపుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ వెళ్లి షాపును పరిశీలించడం… ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్‌, పాడికౌశిక్‌ రెడ్డి సహా పలువురు నేతలు గాయపడ్డ సిబ్బంది పరామర్శించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు… ఘటనకు బాధ్యత వహిస్తూ సీపీతో పాటు బండి రాజీనామా చేయాలని బీఆర్ఎస్‌ డిమాండ్ చేయడమూ హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇక ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా గాయపడ్డవాళ్లను పరామర్శించడం… ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించడం ఇష్యూని ఇంకాస్త సీరియస్‌ చేసింది.

మొత్తంగా… ఓవైపు దుండగుల కోసం పోలీసుల వేట, మరోవైపు నేతల పొలిటికల్ కాకతో కరీంనగర్‌ దొపిడీ వ్యవవహారంపై రాష్ట్రవ్యాప్త చర్చ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *