ఆ బూత్‌ బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందా..? పాత భవనాల్లో భయం పుట్టిస్తోంది ఎవరో తేల్చిన శాస్త్రవేత్తలు..!

ఆ బూత్‌ బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందా..? పాత భవనాల్లో భయం పుట్టిస్తోంది ఎవరో తేల్చిన శాస్త్రవేత్తలు..!


చాలామందికి పాత భవనాల్లోకి లేదా చీకటి గదుల్లోకి వెళ్ళినప్పుడు వెన్నులో వణుకు పుట్టినట్లు, ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. ఇలాంటి అనుభవాలను మనం వెంటనే దెయ్యాలకు లేదా అతీంద్రియ శక్తులకు ముడిపెడతాము. అయితే, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ముఖ్యంగా పాత భవనాల్లో మనకు కలిగే ఆ వింత అనుభూతులకు ఇన్‌ఫ్రాసౌండ్ (Infrasound) కారణమని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఏమిటీ ఇన్‌ఫ్రాసౌండ్?:

సాధారణంగా మనిషి వినగలిగే ధ్వని పౌనఃపున్యం 20 Hz నుండి 20,000 Hz వరకు ఉంటుంది. 20 Hz కంటే తక్కువ ఉండే శబ్దాలను ఇన్‌ఫ్రాసౌండ్ అంటారు. వీటిని మన చెవులు వినలేవు, కానీ మన శరీరం వీటిని గ్రహించగలదు. పాత భవనాల్లోని తుప్పు పట్టిన పైపులు, పురాతన ఏసీలు, కిటికీల గుండా వేగంగా వీచే గాలి ఇలాంటి తక్కువ పౌనఃపున్యం గల తరంగాలను సృష్టిస్తాయి.

కెనడాలోని మాక్‌ఈవాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇన్‌ఫ్రాసౌండ్‌కు గురైన వ్యక్తుల్లో కార్టిసోల్ (Cortisol) అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు గణనీయంగా పెరగడాన్ని వారు గమనించారు. ఆ శబ్దం వినిపించకపోయినా, అది మెదడులో తెలియని భయాన్ని, ఆందోళనను, చికాకును ప్రేరేపిస్తుంది.

ఇవి కూడా చదవండి

కేవలం శబ్దమే కాకుండా, పాత భవనాల్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీకేజీలు లేదా గోడలపై ఉండే విషపూరితమైన బూజు (Mold) కూడా మనుషులలో భ్రాంతులను (Hallucinations) కలిగిస్తాయి. గాలి వెలుతురు సరిగ్గా లేని చోట ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కళ్ళ ముందు ఏదో కదులుతున్నట్లు లేదా వింత ఆకారాలు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి, మీరు ఏదైనా పాత భవనంలో భయపడితే, అది అక్కడ ఉన్న దెయ్యం వల్ల కాదు, మీ మెదడుపై అక్కడి వాతావరణం చూపిస్తున్న భౌతిక ప్రభావం అని గుర్తుంచుకోండి. సైన్స్ దృష్టిలో దెయ్యం అనేది ఒక భ్రమ మాత్రమే!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *