ఫోక్ సాంగ్స్.. ఈ పేరు వింటే చాలు వచ్చే వైబ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచాన్ని తెలంగాణ పల్లె పాటలు ఏలుతున్నాయి అనడంలో సందేహం లేదు. అచ్చమైన పల్లె పాటలు.. అలాగే గ్రామీణ వాతావరణం.. పల్లె పడుచుల అందచందాలు.. తెలంగాణ యాసలో వచ్చే అందమైన జానపద గీతాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక చాలా కాలంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. అయితే మొన్నటి వరకు చాలా పాటలు నెట్టింట రచ్చ చేశాయి. కానీ ఇప్పుడు ఒక సాంగ్ దుమ్మురేపుతుంది. మొన్నటిదాకా కేవలం ప్రోమో మాత్రమే సెన్సేషన్ అయ్యింది. ఎక్కడ చూసిన ఆ సాంగ్ ప్రోమో మారుమోగింది. ఇక చిన్న, పెద్దా ఈ పాటకు చేసిన రీల్స్ గురించి చెప్పక్కర్లేదు. దీంతో ఈ ప్రోమో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశారు నెటిజన్స్. తాజాగా ఈ పాట ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ ఇంతగా మాట్లాడుకుంటున్న పాట ఏంటా అని చూస్తున్నారా.. ? అదే “గున్న గున్న పోయే గునక పూల చిన్నది” సాంగ్.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‌లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
“గున్న గున్న పోయే గునక పూల చిన్నది” అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. విడుదలైన గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ అందుకుంటూ సెన్సేషన్ అవుతుంది. ఒక పల్లెటూరి అమ్మాయి నడకను, ఆమె సోయగాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో వాడిన పదజాలం ఎంతో సరళంగా, మనసుకు హత్తుకునేలా ఉంటుంది. జానపద గీతాలకే ప్రత్యేకమైన మట్టి వాసన ఈ పాటలో అడుగడుగునా కనిపిస్తుంది. ఇఖ ఈ పాటలో మ్యూజిక్, బీట్స్ ఎంతో హుషారుగా ఉండడంతో వినేవారికి మరింత ఎనర్జీని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటలో వాడిన డప్పు చప్పుళ్లు, జానపద వాద్య పరికరాలు పాటకు నిండుదనాన్ని ఇచ్చాయి. గాయనీ గాయకుల గొంతులో ఉన్న పల్లెటూరి తెలంగాణ యాస పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..
ఈ పాటను ఫోక్ సింగర్ మల్లిక్ తేజ సాహిత్యం అందించగా.. డైరెక్షన్, మ్యూజిక్ అందించారు. అలాగే పల్లెటూరి గాయని లక్ష్మక్క సైతం తన గాత్రంతో పాటకు హైలెట్ అని చెప్పొచ్చు. ఈ పాటకు శేఖర్ కొరియోగ్రఫీ అందించగా.. వైష్ణవి, ఈశ్వర్ సాయి, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ, ఫోక్ సింగర్ లక్ష్మక్క, సింగర్ మల్లిక్ తేజ్ నటించారు. మరీ మొన్నటివరకు దుమ్మురేపిన ఈ ఫోక్ సాంగ్ ఫుల్ వీడియో చూసేయండి.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‌తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..