Headlines

Varanasi: ‘వారణాసి’ స్పెషల్‌ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ

Varanasi: ‘వారణాసి’ స్పెషల్‌ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ


చాలా సీక్రెట్‌గా.. చాలా వేగంగా.. ఓ పక్క జక్కన్న వారణాసి సినిమాను వండుతున్న వేళ.. మహేష్ ఫ్యాన్స్‌తో పాటు.. ఫిల్మ లవర్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ. ఈ సినిమా నుంచి కంటెంట్ ఎప్పుడు వస్తుందన్నదే అందరి ఆలోచన. ఈ ఆలోచిస్తున్న మధ్యలో… మెక్సికో కామిక్ కాన్ ఈవెంట్‌లో వారణాసి సినిమాలోని కొన్ని సీన్లు ప్రత్యేకంగా స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. దీంతో ఆ సీన్స్‌ను తాము కూడా చూడచ్చొనే ఆశ మహేష్‌ ఫ్యాన్స్‌లో కలిగింది. అయితే ఈ ఆశే ఇప్పుడు ఆడియాశగా మారింది. ఇవ్వాళ అంటే ఏప్రిల్ 25 ఉదయం.. మెక్కికోలో జరిగిన ప్రఖ్యాత కామిక్‌కాన్ ఎక్స్‌పీరియన్స్‌ – 2026 లో ‘వారణాసి టూ ది వరల్డ్’ పేరుతో తొలి ప్రపంచ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా.. వారణాసి సినిమాలోని కొన్ని గూస్ బంప్స్‌ సీన్లను జక్కన్న అందరికీ చూపించారు. దాంటే పాటే ప్రత్యేకమైన గ్లింప్స్‌ను కూడా ప్లే చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ గ్లింప్స్‌.. సోషల్ మీడియాలో కూడా రిలీజ్‌ అవుతుందనుకున్న ఫ్యాన్స్‌కు జక్కన్న టీం షాకించ్చింది. కామిక్ కాన్ ఈవెంట్‌ వరకు మాత్రమే వారణాసి పత్యేక వీడియో అని.. డిజిటల్ రిలీజ్‌ ఉండదని క్లారిటీ ఇచ్చింది. దీంతో అప్పటి వరకు ఆశ పెట్టుకున్న ఫ్యాన్స్‌ ఇప్పుడు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారణాసి మేకర్స్ వైపు ఆశగా చూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వివాదంలో అనుష్క శ‌ర్మ.. చేతుల‌తో అసభ్యకరమైన సైగ‌లు.. ఫ్యాన్స్ ఆగ్రహం

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *